దీనికి పైజల్ ఆసక్తికరంగా బదులిచ్చాడు. 'థాంక్యూ అమీషా.. నేను ఈ సందర్భంగా పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?' అని రిప్లై ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఫైజల్ తన ట్వీట్ ని డిలీట్ చేశాడు. ఈ లోపే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయింది. అమీషా, ఫైజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు స్పష్టం అయిపోయింది అని నెటిజన్లు అంటున్నారు.