Agent Review: అఖిల్‌ `ఏజెంట్‌` ట్విట్టర్‌ టాక్‌.. అఖిల్‌ కి మళ్లీ డిజాస్టరా? హిట్టా?

First Published | Apr 28, 2023, 5:37 AM IST

అక్కినేని హీరో అఖిల్‌ కి ఇప్పటి వరకు ప్రాపర్‌ హిట్ పడలేదు. ఇప్పుడు `ఏజెంట్‌` చిత్రంతో వస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలవుతుంది. మరి అఖిల్‌కి తొలి హిట్‌ ని ఇచ్చిందా? మరో డిజాస్టర్‌ తప్పలేదా? అనేది ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం. 

అక్కినేని వారసుడు అఖిల్‌.. హీరోగా సక్సెస్‌ కాలేకపోతున్నాడు. అన్న నాగచైతన్య మంచి హిట్లు అందుకుని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ అఖిల్‌ ఇంకా విజయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఆయన నటించిన నాలుగు సినిమాలు పెద్దగా ఆడలేదు. లాస్ట్ మూవీ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఫర్వాలేదు. అంతకు ముందు మూడు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌ `ఏజెంట్‌` చిత్రంతో వస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి `కిక్‌` ఫేమ్‌ సురేందర్‌రెడ్డి దర్శకుడు. మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంతో కొత్త అమ్మాయి సాక్షి వైద్య కథానాయికగా పరిచయం అవుతుంది. నేడు(ఏప్రిల్‌ 28) శుక్రవారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. మొదటగా ఓవర్సీస్‌లో విడుదలైంది. మరి అక్కడి ఆడియెన్స్ టాక్‌ ఎలా ఉంది, అఖిల్‌ తొలి హిట్‌ కొట్టాడా? మళ్లీ బోల్తా పడ్డాడా? అనేది `ఏజెంట్‌ ట్విట్టర్‌ రివ్యూ`లో తెలుసుకుందాం. 

`రా` ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమా ఇదని తెలుస్తుంది. రా ఆఫీసర్‌ మమ్ముట్టి ఓ మాఫియా ముఠాని పట్టుకోవడంలో విఫలమైతే, వాళ్లని పట్టుకోవడానికి మనం కాదు, కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్‌ అయితే బెటర్‌ అని, అలాంటి వాడే ఇలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ని పట్టుకోగలరని, ఆ ఆపరేషన్‌ ఏజెంట్‌ని అఖిల్‌కి అప్పగిస్తారు. దీంతో అఖిల్‌ తన కొంటెతనంతో, అల్లరితో వారిని ఎలా పట్టుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. 
 


ఓవర్సీస్‌ ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన చాలా వరకు సినిమాకి నెగటివ్‌ టాక్‌ వస్తుంది. అఖిల్‌కి మరో డిజాస్టర్‌ తప్పదని అంటున్నారు. ఏజెంట్‌ ఆపరేషన్‌ మిస్‌ ఫైర్‌ అంటున్నారు. సినిమాలో యాక్షన్‌ బ్లాక్స్, ప్రొడక్షన్‌ తప్ప ఇంకేం బాగా లేవని, అఖిల్‌ యాక్షన్‌ పరంగా మెప్పించాడని, కానీ నటనతో ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు. ఫస్టాఫ్‌ కొంత ఫర్వాలేదట. కానీ సెకండాఫ్‌ దారుణంగా ఉందట. స్టోరీ చెత్తగా ఉందని, కథనం చాలా స్లోగా సాగుతుందని, వీఎఫ్‌ఎక్స్ ఎలాంటి క్వాలిటీ లేదని, సిల్లీ క్లైమాక్స్ అని అంటున్నారు. 
 

కొందరు ఫస్టాఫ్‌ కూడా యావరేజ్‌గానే ఉందంటున్నారు. ఆర్డినరీగా, పరమ రొటీన్‌గా ఉందట. ఇంటర్వెల్‌కి ముందు వార్నింగ్‌ ఇచ్చే సీన్‌ తప్ప ఏం లేదంటున్నారు. సాంగ్స్, బీజీఎం ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అవి పెద్ద మైనస్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. హీరోయిన్‌ లిప్‌ సింక్‌ కూడా మ్యాచ్‌ కాలేదని, ఆమె పాత్రకి సంబంధించిన సీన్లు బోరింగ్ గా ఉంటాయట. చాలా నాసిరకంగా ఉందని, వర్క్‌ కూడా కంప్లీట్‌ అయినట్టు లేదంటున్నారు. అఖిల్‌లో ఎనర్జీ ఉంది, కానీ సరైన సీన్లు, స్టోరీ పడలేదంటున్నారు. 

మరికొంత మంది ఫస్టాఫ్‌ గుడ్‌, సెకండాఫ్‌ ఆ స్థాయిలో లేదట. ఇంటర్వెల్‌, అఖిల్‌ వైల్డ్ యాక్టింగ్‌ బాగుందట. సెకండాఫ్‌లో బలమైన కథ అవసరం ఉంది. ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడని అంటున్నారు. కామెడీ సీన్లు కూడా వర్కౌట్‌ కాలేదట. చాలా వరకు తేలిపోయాయని కామెంట్‌ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ ఓకే, బట్‌ సెకండాఫ్‌ లెంన్తీగా, అనేక మలుపులు తిరుగుతూ ఆడియెన్స్ ని అలసిపోయేలా చేస్తుందట. అఖిల్‌, మమ్ముట్టి అదరగొట్టారు కానీ, కథలో దమ్ములేదంటున్నారు. లాజిక్‌ లెస్‌గా సీన్లు చిరాకు తెప్పిస్తాయట. క్లైమాక్స్ దారుణం అంటున్నారు. 

`ఏజెంట్‌` సినిమా పైకి చూడ్డానికి బాగా కనిపిస్తుందని, కానీ కథలో మ్యాటర్‌ లేదని, అసలు సోల్‌ లేదంటున్నారు. టెర్రీఫిక్‌ యాక్షన్‌ స్టంట్స్ ఉన్నాయని, కానీ భయంకరంగా కథ, కథనాలున్నాయట. మమ్ముట్టి నటన ఆకట్టుకుంటుందని, కానీ అఖిల్‌ నటుడిగా ఇంకా చాలా ఎదగాలని అంటున్నారు. అఖిల్‌ ఈ సినిమాతో గట్టిగా హిట్‌ కొట్టాలనే ప్రయత్నం తీరని కోరికగానే మిగిలిపోతుందంటున్నారు. అఖిల్‌కి బెస్ట్ ఆఫ్‌ లక్‌ నెక్ట్స్ మూవీ అంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకి నెగటివ్‌ టాక్‌ ఎక్కువగా వినిపిస్తుంది. 
 

ఇక ఫ్యాన్స్ రివ్యూల విషయానికి వస్తే, సినిమా హిట్‌ పక్కా, అయ్యగారు హిట్‌ కొట్టారని, యాక్షన్ సీన్లు టెర్రిఫిక్‌ అంటున్నారు. సినిమా `ధృవ`, `కిక్‌`, `బిల్లా` తరహాలో సాగుతుందంటున్నారు. పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అంటున్నారు. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరి సినిమా నిజంగానే బాగాలేదా? అభిమానులు చెప్పినట్టుగానే బాగుందా? అనేది తెలియాలంటే `ఏషియానెట్‌` పూర్తిస్థాయి రివ్యూ కోసం వేచి ఉండండి.
 

Latest Videos

click me!