ఏప్రిల్ 28న రెండవ భాగం మరింత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి , శోభిత ధూళిపాళ, త్రిష ఇలా ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.