యాడ్‌ షూట్‌లో అనుష్క శర్మ.. పెళ్లి తర్వాత నటించనన్నావ్‌.. అభిమానుల ప్రశ్నల వర్షం..

First Published Apr 2, 2021, 5:26 PM IST

ఇటీవల పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది అనుష్క శర్మ. జనవరిలో ఆమె మాతృత్వం పొందగా మూడు నెలల్లోనే తిరిగి షూటింగ్‌లు స్టార్ట్ చేసింది అనుష్క. వర్క్ పట్ల తనకున్న డెడికేషన్‌ని చాటుకుంటోంది. అదే సమయంలో అనేక విమర్శలు, ప్రశ్నలు ఎదుర్కొంటుంది. 
 

అనుష్క శర్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను పెళ్లి తర్వాత సినిమాలు చేయనని, పూర్తిగా మానేస్తానని చెప్పింది. తాజాగా ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
undefined
అనుష్క శర్మ ఇటీవల తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నట్టుగా ఓ ఫోటోని పంచుకుంది. దీన్ని ఉద్దేశించి అభిమానులు అనుష్క శర్మపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
undefined
2012లో ఇండియాస్‌ మోస్ట్ డిజైరబుల్‌ టాక్‌ షోలో అనుష్క మాట్లాడారు. వ్యాఖ్యాత సిమి గరేవాల్‌తో ఆమె మాట్లాడుతూ, పెళ్లి తర్వాత నటిస్తారా? అని ప్రశ్నించారు. అందుకు అనుష్క శర్మ స్పందిస్తూ, పెళ్లి తర్వాత పనిచేయదలుచుకోలేదు` అని తెలిపింది.
undefined
`మ్యారేజ్‌ నాకు చాలా ముఖ్యం. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని అనుకుంటున్నా. మ్యారేజ్‌ తర్వాత పని చేయాలనుకోవడం లేదు` అని పేర్కొంది అనుష్క. ప్రస్తుతం ఆ వీడియోని షేర్‌ చేస్తూ అనుష్కని ప్రశ్నిస్తున్నారు.
undefined
ఏంటీ పెళ్లి తర్వాత నటించనన్నావ్‌, ఇప్పుడెలా నటిస్తున్నావ్‌? అంటూ ప్రశ్నిస్తున్నారు. పెళ్లి తర్వాత పలు సినిమాలు చేసింది అనుష్క. `పరి`, `సంజు`, `సూయిదాగా`, `జీరో` వంటి చిత్రాల్లో నటించింది.
undefined
ఇటీవల పాప జన్మించగా, వెంటనే యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంది. ఓ యాడ్‌ షూటింగ్‌లో అనుష్క పాల్గొన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోని పంచుకుంది అనుష్క. దీంతో ఫ్యాన్స్ కి దొరికిపోయింది. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
undefined
అనుష్క శర్మ 2017లో క్రికెట్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని వివాహం చేసుకుంది. అయితే 2013లో అనుష్క, విరాట్‌ కోహ్లీ కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చాలా రోజులు కలిసి తిరిగారు.
undefined
2017లో వీరిద్దరు డెస్టినీ మ్యారేజ్‌ చేసుకున్నారు. అత్యంత వైభవంగా వీరి మ్యారేజ్‌ వేడుక జరిగింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది జనవరి 11న అనుష్క, విరాట్‌ కొహ్లీలకు వామికా అనే కుమార్తె జన్మించారు.
undefined
అనుష్క శర్మ లేటెస్ట్ గ్లామర్‌ పిక్‌.
undefined
click me!