క్రేజీ షోలోకి సుధీర్ రీ ఎంట్రీ ? బాయ్ ఫ్రెండ్ తిరిగిరావడంతో పట్టలేని సంతోషంలో యాంకర్ రష్మీ

Published : Apr 01, 2023, 11:38 AM IST

ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు.

PREV
16
క్రేజీ షోలోకి సుధీర్ రీ ఎంట్రీ ? బాయ్ ఫ్రెండ్ తిరిగిరావడంతో పట్టలేని సంతోషంలో యాంకర్ రష్మీ

ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. 

26

జబర్దస్త్ అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు మంచి క్రేజ్ ఉండేది. ఆ మధ్యన సుధీర్ ఈ రెండు షోలకు గుడ్ బై చెప్పేసి వేరే ఛానల్స్ కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రష్మీ ఒంటరి అయిపోయింది అంటూ హైపర్ ఆది, రాంప్రసాద్ లాంటి వాళ్ళు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. 

36

అయితే సుడిగాలి సుధీర్ ప్రస్తావన వస్తే మాత్రం రష్మీ తెగ సిగ్గుపడుతూ కనిపించేది. సుధీర్ పై రష్మీ ప్రేమ ఇంకా తగ్గలేదు. పలు మార్లు వీరిద్దరూ వేదికలపై రొమాన్స్ పండించారు. అయితే వీళ్లిద్దరూ టిఆర్పి రేటింగ్స్ కోసం రొమాన్స్ నటిస్తున్నారనే వాదన కూడా ఉంది. 

46

ఇదిలా ఉండగా సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు విడుదలైన ప్రోమోలో సుధీర్ ని చూపించారు. అయితే సుధీర్ పూర్తి స్థాయిలో శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తాడా లేదా కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమేనా అనేది చూడాలి. 

56

ఈ ప్రోమోలో ఇంద్రజ పర్పుల్ శారీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె మాట్లాడుతూ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు తమ జీవితాలలో మార్పులు తీసుకువచ్చిన వ్యక్తులని పిలిచి ఈ స్టేజిపై థ్యాంక్స్ చెప్పబోతున్నారు అని తెలిపింది. వెంటనే డైరెక్టర్ తేజ, ఆర్పీ పట్నాయక్, సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చారు. 

66

అలాగే హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాంప్రసాద్ కూడా సందడి చేస్తున్నారు. సుధీర్ ఎంట్రీ ఇవ్వడం ఈ ప్రోమోలో హైలైట్ అని చెప్పాలి. సుధీర్ వచ్చి తన పక్కన నిల్చోవడంతో రష్మీ సంతోషంలో మునిగిపోయింది. ఆమె కళ్ళల్లో ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సిగ్గుని దాచేస్తూ పరవశంలో మునిగిపోయింది. ఆ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. వేదికపై వీరిద్దరూ ఏం చేశారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం ఆయె వరకు వేచి చూడాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories