నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ( డిసెంబరు 2) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ముందుగా ఈమూవీ ప్రిమియర్ షోస్ యూఎస్ లో సందడి చేయగా.. అక్కడి ఆడియన్స్ తమ అభిప్రాయాలు ట్విట్టర్ లో వెల్లడిస్తున్నారు. మరి వారు ఏమంటున్నారు చూద్దాం.
హిట్2 సినిమాకు భారీగానే పబ్లిసిటీ చేశారు. మీరో నాని నిర్మాత కావడంతో ఎక్కడా తగ్గలేదు.. టీజర్, ట్రైలర్, తో పాటు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాట కూడా ప్రేక్షకులను మెప్పించడంతో అంచనాలు భారీగా ఎర్పడ్డాయి. ఇక ప్రీ రిలీజ్ లో స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సందడి చేయడంతో హిట్ 2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అటు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు సమాచారం.
ఇక ఈమూవీపై రకరకాలుగా స్పందిస్తున్నారు ట్విట్టర్ ఆడియన్స్. హిట్ 2పై ట్విట్టర్ ల పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా చాలా బాగుందంటూ ఎక్కువమంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొంత మంది ఆడియన్స్.. ఈసినిమాకు అడివి శేష్ పెద్ద ప్లాస్ అంటున్నారు. మ్యూజిక్ తో పాటు సినిమాటోగ్రఫీపై.. ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు.
హిట్: ది సెకండ్ కేస్ సినిమాపై భాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ముఖ్యంగా అడవి శేష్ పెర్ఫామెన్స్ కు ఫిదా అవుతున్నారు మూవీ లవర్స్. ఇక ఈమూవీ స్క్రీన్ ప్లే కూడా బాగా ఆకట్టుకోవడంతొ.. హిట్2పై పక్కా పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఇక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మూవీపై కాస్త నెగెటీవ్ టాక్ ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కొంత మంది మాత్రమే అంటున్నారు. మిగతా మూవీ అంతా సూపర్ అంటూ ట్విట్టర్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఫస్ట్ హాఫ్ మూవీ డీసెంట్ గా ఉంది. ఇంట్రవెల్ బాంగ్ అద్భుతం.. ట్విస్ట్ అదిరిందంటూ ట్వీట్ చేస్తున్నారు.
సినిమా స్క్రీన్ ప్లేతో పాటు అన్నీ అద్భుతంగా వచ్చాయంటున్నారు ట్విట్టర్ ఆడియన్స్. అయితే.. హిట్ 3 హిట్ ఇచ్చేలా ఈ సినిమా క్లైమాక్స్ ఉందంటూ కొందరు ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ విషయాలు ట్వీట్ చేస్తున్నారు. హిట్ 3 పక్కాగా వస్తుందంటున్నారు.
ఇక నిర్మాతగా నాని, దర్శకుడిగా శైలేష్.. హిట్ సిరీస్ ను సక్సెస్ బాట పట్టించారు. ఈ ప్రయత్నంలో అడివి శేష్ జాయిన్ అవ్వడం ఈసినిమాకు అతి పెద్ద ప్లాస్ అని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుంది..? ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.