HIT 2 Review: హిట్ 2 ప్రీమియర్ టాక్... పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చిన అడివి శేష్, అసలు ట్విస్ట్ అదే!

First Published Dec 2, 2022, 5:31 AM IST

వరుస విజయాలతో జోరుమీదున్న అడివి శేష్... ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించారు. ఆయనకు థ్రిల్లర్స్ బాగా కలిసి రాగా... మరోసారి అదే జోనర్ ట్రై చేశారు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 నేడు విడుదలైంది. హిట్ 2 ప్రీమియర్స్ ముగియగా టాక్ ఎలా ఉందో చూద్దామా 
 

HIT 2 Movie review

కథ 

సంజన అనే ఒక యంగ్ గర్ల్ మర్డర్ కి గురవుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ రంగంలోకి దిగుతాడు. సంజనను హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడం తనకు చాలా సులభం అని మొదట అడివి శేష్ భావిస్తాడు. అయితే కిల్లర్ అడివి శేష్ కి అడుగడున సవాల్ విసురుతూ ఉంటాడు. అసలు చనిపోయింది సంజన మాత్రమే కాదు. సంజన డెడ్ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాల సమాహారం అని తెలుసుకొని నివ్వెర పోతారు. అసలు ఎవరీ సీరియల్ కిల్లర్? అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు? అడివి శేష్ కిల్లర్ ని పట్టుకున్నాడా? ఇదే మిగతా కథ 
 


విశ్వక్ సేన్ హీరోగా 2020లో విడుదలైన హిట్ మంచి విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా హిట్ 2 తెరకెక్కింది. అడివి శేష్ కి గతంలో థ్రిల్లర్స్ బాగా కలిసొచ్చాయి. క్షణం, ఎవరు గొప్ప విజయాలు అందుకొన్నాయి. హిట్ 2 తో మరోసారి ఆయన క్రైమ్ థ్రిల్లర్ ఎంచుకున్నారు. 
 


క్రైమ్ థ్రిల్లర్స్ సెటప్ దాదాపు అన్ని సినిమాలకు ఒకేలా ఉంటుంది. కిల్లర్ ఎవరు? అతడు ఎందుకు చంపుతున్నాడు? అనేది సినిమాకు ప్రధానం. అది అంచనాలకు అందకుండా ప్రేక్షకుడు భ్రమపడేలా చేస్తూ సినిమా నడపగలిగితే విజయం మనదే. మరి ఆ విషయంలో శైలేష్ కొలను సక్సెస్ అయ్యాడా? అంటే అయ్యాడు. 

HIT 2 Review

ప్రీమియర్ టాక్ ద్వారా చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. మొదటి భాగం మొత్తం సెటప్ కి  వాడేశాడు దర్శకుడు. అమ్మాయి మర్డర్ జరుగుతుంది. అది ఎవరు చేశారనే కోణంలో కథ సాగుతుంది. ఇంటర్వెల్ వరకు సినిమా అదే టెంపోలో నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్లేదు. ఫస్ట్ హాఫ్ సినిమా యావరేజ్ గా ఉంటుంది. ప్రేక్షకుడు కిల్లర్ ఎవరనే... సస్పెన్సు మాత్రం ఫీల్ అవుతాడు. 
 

hit 2 trailer

అసలు కథ, ట్విస్ట్స్ సెకండ్ హాఫ్ లో చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ కి మించి సెకండ్ హాఫ్ ఉంది. కథలో భాగంగా వచ్చే మలుపులు అలరిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు బలం. విలన్ ఎవరు? అతడు అమ్మాయిలను చంపడం వెనుక కారణం ఏమిటనేది? ఆడియన్స్ కి చెప్పుకోదగ్గ అనుభూతి పంచుతాయి. కిల్లర్ ని రివీల్ చేసిన విధానం బాగుంది. 

హిట్ 3 సైతం ఉంటుందని శైలేష్ కొలను చెప్పిన నేపథ్యంలో ఆ మూవీలో నటించే హీరోని పరిచయం చేయడం మెప్పిస్తుంది. హిట్ 2 క్లైమాక్స్ లో అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. అడివి శేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యాయి. దర్శకుడు రాసుకున్న కథ పర్లేదు. స్క్రీన్ ప్లే బాగుంది. బీజీఎమ్ అంతగా ఆకట్టుకోలేదన్న మాట వినిపిస్తుంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధిలో ఆకట్టుకున్నారు.  


మొత్తంగా ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ శైలేష్ కొలను ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ అందించారు అంటున్నారు. అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడిందనే అభిప్రాయం వినిపిస్తోంది. హీరో నాని నిర్మాతగా సక్సెస్ అయినట్లే. మరి కమర్షియల్ గా హిట్ 2 ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. 

click me!