అప్పుడు ఆదిత్య ,దేవి నా బిడ్డ అని అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మాకు పిల్లలు లేరు అని బాధపడుతున్న మా కుటుంబమంతా దేవి నీ మా సొంత బిడ్డలాగే చూస్తున్నాము అని అంటాడు ఆదిత్య. మీది చాలా పెద్ద మనసు, అందరూ ఇలా మంచిగా ఉండరు ధన్యవాదాలు మీ మేలు మేము మర్చిపోలేము అని జానికమ్మ ఆదిత్యతో అంటుంది. మాధవ్ లోపల కుళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జానకమ్మ దేవితో,నీకేం తక్కువ చేసాం అమ్మ, ఇంట్లో నుంచి వెళ్లిపోయావు అని అనగా మాధవ్, దేవితో నేను మాట్లాడతాను మీరందరూ వెళ్లండి అని అంటాడు. ఈలోగా జానకమ్మ వాళ్ళు దేవికి తినడానికి తయారు చేయడానికి వంట గదిలోకి వెళ్తారు. మాధవ్ దేవి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నట్లు నటిస్తూ, నాన్నకి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు అమ్మ అని బాధపడతాడు. అప్పుడు ఆదిత్య, రాధ ,తన బాధ నాకు చెప్పింది. ఇంకెవరు తన్నేం అడగాల్సిన అవసరం లేదు తీసుకెళ్ళి తనకి భోజనం పెట్టండి అని వాళ్ళిద్దర్నీ పంపించేస్తాడు.