ఇప్పటికే వరుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. మరోవైపు ప్రచార కార్యక్రమాలనూ జోరుగానే కొనసాగిస్తున్నారు. అదీగాక చిత్రాన్ని తెలుగులో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తుండగా.. మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి.