Published : Aug 27, 2022, 01:15 PM ISTUpdated : Aug 27, 2022, 02:20 PM IST
ట్విట్టర్ లో ఆంటీ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇండియా వైడ్ ట్విట్టర్ లో ఇదో పెద్ద చర్చ అయ్యింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి.
చిన్న ట్వీట్ తో మొదలైన సోషల్ మీడియా తుఫాన్ కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి యాంకర్ అనసూయకు మధ్య పోరు నడుస్తుంది. రెండు రోజులుగా అనసూయ కూడా తగ్గకపోవడంతో యుద్ధం నడుస్తుంది.
210
Trolls and Memes
లైగర్ మూవీ ప్లాప్ కావడానికి కారణం గతంలో విజయ్ దేవరకొండ తల్లిని తిట్టడమే అని అర్థం వచ్చేలా అనసూయ ఇండైరెక్ట్ ట్వీట్ వేశారు. విజయ్ దేవరకొండ గురించే అనసూయ ఆ కామెంట్ చేశారని భావిస్తున్న ఫ్యాన్స్ ఆమెపై కక్ష కట్టారు.
310
Trolls and Memes
నిన్నటి నుండి ఆమెలోని లోపాలు ఎత్తి చూపుతూ మీమ్స్, ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. ట్యాగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అటువైపు నుండి అనసూయ కూడా తగ్గడం లేదు. సదరు నెగిటివ్ ట్వీట్స్ ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుంది.
410
Trolls and Memes
ముఖ్యంగా ఆంటీ అని కామెంట్ చేస్తే పోలీస్ కేసు పెడతా అన్నారు. ఇది కూడా క్రైమ్ క్రిందకే వస్తుంది. స్క్రీన్ షాట్స్ ఆధారంగా నన్ను ఆంటీ అన్నవాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆమె ట్వీట్ చేశారు.
510
Trolls and Memes
అప్పటి నుండి అనసూయను ట్యాగ్ చేయకుండా ఆంటీ హ్యాష్ ట్యాగ్ తో వందల కొద్దీ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. వీడియోలు, కామెంట్స్ పోస్ట్స్ చేస్తూ భారీగా ఆంటీ అనే పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు.
610
Trolls and Memes
వీటిలో కొన్ని మీమ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆంటీ అంటే జైల్లో వేశారని గగ్గోలు పెడుతున్న మీమ్స్ ని నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
710
Trolls and Memes
అనసూయతో వివాదం కారణంగా లైగర్ పై మీమ్స్ పడిపోయాయి అంటున్నారు. అన్నింటికీ మించి ఈ వివాదం హైలెట్ కావడంతో లైగర్ టీమ్ బ్రతికిపోయారనే అభిప్రాయం వినిపిస్తుంది.
810
Trolls and Memes
అనసూయ వివాదం ట్రెండ్ అయ్యేవరకు లైగర్ టీం ని నెటిజెన్స్ ఆడుకున్నారు. మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో చేసిన హడావుడికి తీసిన సినిమాకు సంబంధం ఉందా అంటూ ఏకిపారేశారు.
910
Trolls and Memes
అయితే అసలు విషయం సైడై కొసరు విషయం తెరపైకి వచ్చింది. ఎప్పుడో అర్జున్ రెడ్డి సినిమా సమయంలో జరిగిన గొడవను అనసూయ తెరపైకి తెచ్చారు.
1010
Trolls and Memes
ఇక తనను ట్రోల్ చేసే వాళ్ళను కర్మ వదలదు. అందరూ అనుభవిస్తారని ఆమె శాపనార్థాలు పెట్టడం విశేషం. మొత్తంగా ఈ గొడవ చల్లారేదెప్పుడో అర్థం కావడం లేదు.