
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..సత్య మాధవ్ కి ఫోన్ చేసి, దేవి నిజంగానే కనిపించడం లేదా అని అడుగుతుంది. దానికి మాధవ్, అవును నిన్నటి నుంచి కనిపించడం లేదు అని చెప్తాడు. అప్పుడు సత్య, దేవి కనిపించడం లేదు అని తెలిసిన వెంటనే మా ఆదిత్య పరిగెట్టుకుంటూ వెళ్లిపోయాడు అని అనగా, మరి నేను అదే కదా చెప్తున్నాను కదా! నా కూతురు మీద నా కన్నా వాడికి అంత కంగారు ఎందుకు అని అంటాడు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని సత్య ఫోన్ పెట్టేసి కూతురు కానీ కూతురు కోసం ఎందుకు ఆదిత్య అలా తపన పడిపోతున్నాడు.
అయినా తన భర్తతో వెతకకుండా ఆదిత్యతో కూతురు కోసం వెతకాల్సిన పనేంటి అక్కకి అని ఆలోచనలో పడుతుంది సత్య. ఆ తర్వాత సీన్లో రుక్మిణి రోడ్లమీద దేవి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య అక్కడికి వస్తాడు. రుక్మిణి దొరికిందా అని ఆదిత్య అనగా, లేదు పెనిమిటి నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నాను అని అంటాడు. దానికి ఆదిత్య కోప్పడి, అసలు ఇంట్లో దేవి లేకపోతే మీరేం చేస్తున్నారు నిన్నటి నుంచి కనబడటం లేదు అంటే నాకు ఒక మాట కూడా చెప్పలేదు. అసలు నాకు చెప్పాలని ఉద్దేశం మీకు ఉన్నదా లేదా నన్ను దేవిని కానీ వాడిని చేసేసావా.
ఇదంతా నీ వల్లే వచ్చింది అసలు దేవి ఇంట్లో లేనప్పుడు చూసుకోవాలి కదా తనని ఇలాగ బాధ పెట్టడం ఎందుకు. ఇప్పుడు దేవి నాకు కనిపించిన వెంటనే నేనే తన తండ్రిని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి, నేను మీకు పాప గురించి వెతకమన్నాను కదా ఆ పాపకు గురించి ఏమైంది అని అడుగుతాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్, వెతుకుతున్నాను సార్ మీరు చెప్పినందువలన ఇంకా గట్టిగా వెతుకుతున్నాము చెక్ పోస్ట్ లు అన్ని వెతుకుతున్నాము దొరికిన వెంటనే మీకు చెప్తాము అని అంటారు. తర్వాత ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు మాధవ్ కారులో వెళ్తూ ఇప్పుడు సత్య, దేవి నా కూతురే అనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇప్పుడు దేవిని ఎలాగైనా పట్టుకొని ఇంకొక పెద్ద నాటకం మొదలు పెట్టాలి అని దేవి కోసం వెతుకుతూ ఉండగా దారిలో ఆదిత్య కనిపిస్తాడు. అప్పుడు ఇద్దరు కార్ దిగుతారు.ఆదిత్యతో ఆటాడుకుందాం అని మాధవ్ అనుకుంటాడు. కానీ ఆదిత్య మాధవ్ చొక్కా పట్టుకొని, దేవిని ఏం చేశావురా ఏం చెప్పుడు మాటలు చెప్పి దేవిని ఇంట్లో నుంచి పంపించేశావు అని అడుగుతాడు. ఏదో చెప్పుడు మాటలు చెప్పి పంపించాల్సిన కర్మ నాకు లేదు అయినా నా ఇంట్లో నుంచి నా దేవిని నేనెందుకు పంపిస్తాను.
దేవి కనపడటం లేదనే తిరుగుతున్నాను అని అంటాడు మాధవ్. దానికి ఆదిత్య, దేవి కనబడకపోవడంలో నీ హస్తం లేదంటే నువ్వు బతుకుతావు లేకపోతే నీ చావు నా చేతుల్లోనే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ప్రతి సందులోనీ, ప్రతి ఇళ్లలోని రుక్మిణి వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య ఫోన్ చేసి దేవి దొరికిందా అని అడుగుతాడు లేదు అని రుక్మిణి అనగా, ఇన్ని రోజులు నీ మాట విని వదిలేసాను రుక్మిణి చెప్తున్నాను దేవి దొరికిన వెంటనే ఇంక మీ దగ్గర నుంచి దేవిని తీసుకెళ్ళిపోతాను.
మరోవైపు రుక్మిణి రాత్రి వరకు ఊరంతా వెతుకుతూనే ఉంటుంది. అప్పుడు ఆదిత్య అక్కడికి వచ్చి సోడా ఇస్తాడు. సోడా తాగిన తర్వాత రుక్మిణి, ఎంత వెతికినో దొరకలేదు పెనిమిటి ఎక్కడికే వెళ్లిందో కంగారుగా ఉన్నది అని అనగా మరి కూతురు గురించి చూసుకోవాలి కదా రుక్మిణి నేను వెళ్లి వెతుకుతాను అని ఆదిత్య అంటాడు. దానికి రుక్మిణి నేను వస్తాను అంటే ఏం అవసరం లేదు నాకు దొరికిన వెంటనే అట్నుంచి అంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని ఆదిత్య అంటాడు. మళ్ళీ ఆగి, నువ్వు కూడా రా కలిసి వెతుకుదాము నేను తీసుకెళ్తుంది కేవలం దేవికి తల్లిగా మాత్రమే.
ఎందుకంటే నేనే దేవి తండ్రిని అని నువ్వే చెప్పాలి కదా అని అనగా, నువ్వు అంత గట్టిగా మాట్లాడొద్దు పెనిమిటి నాకు బాధగా ఉన్నది అని రుక్మిణి అంటుంది. మరి నన్ను ఏం చేయమంటావు రుక్మిణి నేను ముందే చెప్పాను దేవినీ జాగ్రత్తగా చూసుకొ అని.దేవి నీ దగ్గర ఉన్నప్పుడు కనిపించడం లేదు అంటే మరి నిన్ను కాక ఇంక ఎవరిని తిడతాను పదా వెళ్లి వెతుకుదాము అని అంటాడు. రుక్మిణి ఆదిత్య కార్ ఎక్కడం మాధవ్ చూస్తాడు. ఆ తర్వాత సీన్లో సత్య కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా దేవుడమ్మ అక్కడికి వచ్చి, ఎంత చెప్పినా నువ్వు మారవు ఆదిత్య కూడా మారడు.
ఏదో తెలియని సమస్యకి ఇద్దరు బాధపడుతున్నారు అయినా ఆదిత్య దేవి కోసం వెతకడానికి వెళ్ళాడు కదా వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో నువ్వు భోజనం చేసి పడుకో అని చెప్తుంది దేవుడమ్మ. దానికి సత్య, నేను చేస్తానులెండి ఆంటీ మీరు వెళ్ళండి వెళ్లి పడుకోండి భోజనం చేసి నేను పడుకుంటాను అని చెప్పి దేవుడమ్మ ని పంపించేస్తుంది. అప్పుడు సత్య మనసులో, ఎలాగా ఆదిత్య నాకోసం ఆలోచించడు కదా నేనెందుకు వాడి కోసం రాత్రంతా పస్తులుండాలి వెళ్లి భోజనం చేస్తాను అని అన్నం కలుపుకొని తింటూ ఉండగా సత్య కి ఒక మెసేజ్ వస్తుంది.అందులో ఆదిత్య, రుక్మిణి కలిసినట్టు మాధవ్ ఫోటో పంపుతాడు.సత్య ఆశ్చర్య పోతుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!