ఆదిత్య (Adithya) ఇంట్లో ఒంటరిగా నిల్చొని మోనిత మాట్లాడిన మాటలను, కార్తీక్ (Karthik) మాట్లాడిన మాటలను తలుచుకుంటాడు. మమ్మీ, అన్నయ్య ఈ విషయం ఎందుకు చెప్పలేదని అనుకుంటాడు. చెబితే నా కోపం ఇంకా ఎక్కువగా చూపిస్తానన్న ఉద్దేశంతో చెప్పలేదేమోనని అర్థం చేసుకుంటాడు.