సినిమాలు, సిరీస్లు... క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ సత్తా చాటుతుంది. సమంత (Samantha) , మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో ప్రియమణి కీలక రోల్ చేశారు. ఆమె మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. ఫస్ట్ సిరీస్లో కూడా ఈ జంట సందడి చేశారు.
ఫ్రస్ట్రేటెడ్ భార్యగా ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి (Priyamani) పాత్ర అలరిస్తుంది. ఇక తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కలిపి ఏడు చిత్రాల వరకు ప్రియమణి చేస్తున్నారు. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రానా (Rana) -సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన నారప్ప మూవీలో డీగ్లామర్ రోల్ లో అలరించిన ప్రియమణి, విరాటపర్వంలో మరోమారు అదే తరహా సీరియస్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న విరాట పర్వం విడుదలకు సిద్ధమైంది.
అలాగే అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం మైదాన్ లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫుట్ బాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా మైదాన్ తెరకెక్కుతుంది. ఇక అట్లీ-షారుక్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రియమణి నటిస్తున్న విషయం తెలిసిందే. లయన్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.
గతంలో షారుక్, దీపికా పదుకొనె కాంబినేషన్ లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ప్రియమణి ఐటమ్ సాంగ్ చేయం విశేషం. ఓ కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీతో పాటు తమిళ చిత్రాలు ఆమె చేస్తున్నారు.
ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతున్నారని, ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీపావళి వేడుకలలో జంటగా కనిపించిన ప్రియమణి, ముస్తఫా... ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.
ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.... వృతి రీత్యా చాలా కాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. నటిగా బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాకు పరిమితం అయ్యారు. ముస్తఫా మొదటి భార్య... వీరి వివాహం చెల్లదని న్యాయ పోరాటం చేస్తుండగా, ప్రియమణి విడాకుల వార్తలకు ప్రాధాన్యత దక్కింది.