పెళ్లి బంధంతో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు ఆస్తుల వివరాలు ఇవే!

అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటైన అదితి రావు హైదరి, సిద్ధార్థ్ సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్న తమ వివాహ వేడుకల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కాగా వారి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

అదితి రావు హైదరి

హైదరాబాద్ రాజ కుటుంబానికి చెందిన అదితి రావు హైదరి నికర సంపద రూ. 60-65 కోట్లుగా అంచనా. జాగ్రన్ ఇంగ్లీష్, సియాసత్ నివేదిక ప్రకారం, సిద్ధార్థ్ నికర సంపద రూ. 70 కోట్లుగా భావిస్తున్నారు. దీని ప్రకారం, ఈ జంట మొత్తం సంపద రూ. 130 నుండి 135 కోట్ల మధ్య ఉంటుంది.

అదితి రావు హైదరి

ఇటీవల హీరామండి: ది డైమండ్ బజార్‌లో నటించిన అదితి రావు హైదరి, ఒక సినిమా/ వెబ్ సిరీస్‌కి రూ. 1 కోటి పారితోషికంగా తీసుకుంటుంది. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్‌లో నటించినందుకు ఆమె రూ. 1 నుండి 1.5 కోట్ల వరకు తీసుకుందట.  ఆమె నెక్స్ట్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన గాంధీ టాక్స్‌లో కనిపించనుంది.


సిద్ధార్థ్

మరోవైపు, సిద్ధార్థ్ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు పారితోషికంగా తీసుకుంటాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఇండియన్ 2లో కమల్ హాసన్‌తో కలిసి నటించినందుకు ఈ నటుడు రూ. 4 కోట్లు పారితోషికంగా పొందాడు. నెక్స్ట్ ఇండియన్ 3లో కనిపించనున్నాడు. సిద్ధార్థ్ సూర్యనారాయణ అలియాస్ సిద్ధార్థ్ ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తారు.

 నటనతో పాటు, సిద్ధార్థ్ చిత్ర రచయిత, నిర్మాత, నేపథ్య గాయకుడు కూడాను. ఆయన అనేక ప్రకటనలలో కూడా కనిపించాడు. తెలుగులో సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. అతడికి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో భారీ హిట్స్ నమోదు చేశాడు. 

అదితి రావు హైదరి

ఇక అదితి రావు హైదరి వివరాలు పరిశీలిస్తే...  ప్రధానంగా హిందీ, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. త్యాబ్జీ-హైదరి కుటుంబంలో జన్మించిన ఆమె, మలయాళ చిత్రం ప్రజాపతితో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం, సముద్రం చిత్రాల్లో ఆమె నటించారు. గతంలో అదితి రావ్ హైదరి ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. అతనితో విడాకులు తీసుకుని సిద్ధార్థ్ ని రెండో వివాహం చేసుకుంది. సిద్ధార్థ్ కి కూడా ఇది రెండో వివాహం. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!