ఎపిసోడ్ ప్రారంభంలో ఇదే మనం ఉండబోయే గది నువ్వు లోపలికి వెళ్ళు నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను అంటాడు యష్. అదేంటి బిజినెస్ మీటింగ్ కదా బయట గార్డెన్లో జరుగుతుంది అనుకున్నాను కానీ రూమ్ తీసుకున్నారేంటి అయినా లోపల నాకు ఎవరూ తెలియదు. మీరు ఫోన్ మాట్లాడి రండి ఇద్దరం కలిసే వెళ్దాము అంటుంది వేద. లోపలికి వెళ్ళు నీకే తెలుస్తుంది అంటూ కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్.