Devatha: మరో ప్లాన్ లో మాధవ సక్సెస్.. అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసిన ఆదిత్య!

Published : Jul 26, 2022, 11:55 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 26ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
18
Devatha: మరో ప్లాన్ లో మాధవ సక్సెస్..  అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసిన ఆదిత్య!

ఈరోజు ఎపిసోడ్ లో మాధవ(madhava)కారులో వెళుతూ ఆదిత్య కి ఫోన్ చేసి మాట్లాడుతాడు. నన్ను చాలా మార్చేసావు రాధ. నీ మీద ఉన్న ఇష్టం నా మనసు కష్టంగా అనిపించే పనులు కూడా చేస్తోంది అని తనను తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. మరొకవైపు రాధ(radha)ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య కోపంగా మాధవ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రాధ,ఆదిత్యకు పదేపదే ఫోన్ చేసినా కూడా ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయడు.
 

28

అప్పుడు రాధ భగవంతుడా ఏం గొడవలు జరగకుండా చూడు అని టెన్షన్ పడుతూ దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య(adithya), మాధవ ఇద్దరు ఎదురు పడతారు. అప్పుడు ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు మాధవ ఏమీ లేదు ఆఫీసర్ సారు మీరు మా ఇంటి చుట్టూ రాధ కోసం, పిల్లల కోసం తిరిగింది చాలు ఇక మానేయండి అని అంటాడు. రాధ(radha)తో మాట్లాడడం దేవినీ ఇంటికి తీసుకెళ్లడం అసలు మా ఇంటికి రావడమే మానేయ్ అని అంటాడు.
 

38

ఎందుకంటే రాధ నా భార్య దేవి(devi) నా కూతురు కాబట్టి అనడంతో ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వెంటనే మాధవ చెంప చెల్లుమనిపిస్తాడు ఆదిత్య. మౌనంగా ఉన్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ ఆదిత్య స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. నాలో ఆఫీసర్ సార్ ని మాత్రమే చూసావు ఆదిత్యను చూడలేదు. నా భార్య బిడ్డల్ని తెచ్చుకోలేని చాతగాని వాడు కాదు ఈ ఆదిత్య(adithya)మీ తల్లిదండ్రులు నీ బిడ్డ ఏమైపోతారో అని ఆలోచించి రాధా ఆ ఇంట్లో ఉండడంతో నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాను అని కోపంగా మాట్లాడుతాడు ఆదిత్య. 
 

48

ఇంకొకసారి ఇలాగే మాట్లాడితే నీ కూతురు తండ్రి లేని అనాధ అవుతుంది గుర్తుంచుకో అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య(adithya). ఇకపై నేనేంటో చూపిస్తాను అని మాధవ అనగా ఏం చేయలేవు అంటూ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మాధవ అదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేసి ఉంటాడు. మరొకవైపు సత్య (sathya)అమెరికాకు వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అప్పుడు అందరు సంతోషంగా కనిపించగా ఆదిత్య ఇంతలో అక్కడికి వస్తాడు.
 

58

 అప్పుడు అందరూ ఎవరికి వారు సంతోషంగా మాట్లాడుతూ ఉండగా ఆదిత్య మాత్రం మౌనంగా ఉంటాడు. అప్పుడు ఆదిత్య(adithya)మనం అమెరికాకు వెళ్లడం లేదు సత్య అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు సత్య,దేవుడమ్మ(devudamma)ఎంత నచ్చినా కూడా ఆదిత్య వెళ్లదు కుదరదు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను వద్దు అంటున్నది ఒక మంచి పని కోసమే అనగా అర్థం చేసుకోండి అని అనగా సత్య సీరియస్ అవుతుంది.
 

68

కొంచెం వెయిట్ చేసే అందరికీ అన్ని విషయాలు అర్థం అవుతాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. మరొక వైపు రాధ(radha) ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాధవ వస్తాడు. అప్పుడు రాధ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా నీకు ఒక విషయం చెప్పాలి రాధ అని చెప్పి నువ్వు నన్ను కొట్టాలి అని చూసావు కానీ ఆదిత్య(adithya)నన్ను కొట్టేశాడు అని అంటాడు. అప్పుడు రాధ నువ్వు తప్పుగా మాట్లాడి ఉంటే అందుకే నేను కొట్టింటాడు అని అంటుంది.
 

78

 అప్పుడు మాధవ, రాధకు వీడియో చూపించడంతో రాధ(radha) ఒకసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మాధవ ఇప్పుడు చెబుతున్నాను చేతనైతే నిన్ను దేవిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళమని చెప్పు డబ్బులు వాడుకుంటాడో తనకున్న పరపతినీ వాడుకుంటాడో ఆదిత్య ఇష్టం అని అంటాడు. అప్పుడు రాధ ఆ వీడియో ఎందుకు ఎవరికి చూపిస్తావు అని అనగా వెంటనే మాధవ నువ్వు దేవి(deviki)కి ఆదిత్యని నీ తండ్రి అని చెప్పిన మరుక్షణమే ఈ వీడియోని చూపిస్తాను అనడంతో రాధా షాక్ అవుతుంది.
 

88

 అప్పుడు మాధవ(madhava)ప్లాన్ విన్న రాధ షాక్ అవుతుంది. మరొకవైపు సత్య, ఆదిత్య అన్న మాటలు తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి దేవుడమ్మ దంపతులు వస్తారు. ఆ తర్వాత కమలా భాష వాళ్ళు అందరూ వచ్చి సత్యకి ధైర్యం చెబుతారు. అప్పుడు ఎలాగో నువ్వు అమెరికాకు వెళ్లడం లేదు కాబట్టి వరలక్ష్మి వ్రతం నువ్వే చెయ్యి అని చెబుతుంది ఆ దేవుడమ్మ(devudamma). ఏం మంచి అక్క ఆంటీ ఎన్నో పూజలు చేసింది నాతో కూడా ఎన్నో పూజలు చేయించింది కానీ ఇప్పటివరకు ఏ విషయంలో మనకు మంచి జరిగింది అని అంటుంది సత్య.

click me!

Recommended Stories