ఈరోజు ఎపిసోడ్ లో దేవి, ఆదిత్యతో మాట్లాడుతూ మా నాయన కనిపిస్తే ఆయన కాళ్లు పట్టుకొని అయినా చెడ్డ అలవాటులను మానిపిస్తాను మా నాన్నను వెతకడానికి నాకు సహాయం చేస్తావా సారు అని ఆదిత్య అని అడుగుతుంది దేవి. అప్పుడు ఆదిత్య తప్పకుండా సహాయం చేస్తాను దేవి అనటంతో దేవి సంతోషపడుతుంది. ఆ తర్వాత ఆదిత్య కార్లో వెళుతూ దేవి అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే రాధ.ఫోన్ చేయడంతో ఆదిత్య కారు పక్కకు ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు.