దాంతో జ్ఞానాంబ, గోవిందరాజులు ఇద్దరూ మల్లికను తిడుతూ ఉంటారు. విష్ణు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పనిమనిషి చికిత కూడా తిడుతూ ఉంటుంది. అప్పుడు విష్ణు దీంతో ఇంకా మాటలు ఏంటి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవే, అమ్మానాన్నలను పిలుచుకొని రా అంతవరకు నువ్వు లోపలికి రావద్దు అనడంతో మల్లిక విష్ణు కాళ్లు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే అదంతా జరిగినట్టు మల్లిక ఊహించుకుంటుంది. అప్పుడు విష్ణు ఏమయింది అని అడగడంతో ఏదో పిడకల వచ్చిందండి అని అంటుంది మల్లిక.