తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ లేకపోయినా.. ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నది ఎవరో తెలుసా? 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న హీరో ఎవరు? ఇండియాలోనే రిచ్ హీరోగా గుర్తింపు సాధించిన తెలుగు హీరో గురించి మీకు తెలుసా?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలలో ఒకడు. ప్రస్తుతం హిట్ సినిమాలు లేకున్నా స్టార్ డమ్ ను కొనసాగిస్తున్న సీనియర్ హీరో. సినిమాలు, స్టూడియోలు, వ్యాపారాలు, యాంకరింగ్.. ఇలా మాల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్న నటుడు. దాదాపు 3000 కోట్లకుపైగా ఆస్తి కలిగి ఉన్న టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున. చేతి నిండా సంపాదిస్తూ.. వేల కోట్ల ఆస్తులతో.. టాలీవుడ్ లోనే కాదు, నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకుంటున్నాడు నాగ్.
26
66 ఏళ్ల కుర్ర హీరో.. టాలీవుడ్ మన్మధుడు..
టాలీవుడ్ లో దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ.. స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలు కుళ్లుకునేలా ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు వ్యాపారంలో కూడా రాణిస్తున్న నాగార్జున.. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతుడిగా గుర్తించబడుతున్నారు. తెలుగు పరిశ్రమలో రొమాంటిక్ ఇమేజ్ ను సాధించిన మొదటి హీరో నాగార్జున. టాలీవుడ్ మన్మధుడిగా పేరుతెచ్చుకున్న నాగ్ తో సినిమా కోసం హీరోయిన్లు పోటీపడేవారు అప్పట్లో.
36
అక్కినేని నట వారసుడిగా
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా 1986లో ‘విక్రమ్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నాగార్జున, అతి తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు. 90వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో పాటు నాగార్జున కూడా టాలీవుడ్ కు ఒక పిల్లర్ లా ఉన్నాడు. నలుగుడు సీనియర్ హీరోలు ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. కానీ నలుగురిలో నాగార్జున మాత్రం సినిమాల విషయంలో కాస్త వెనకబడి ఉన్నాడు. పెద్దగా సక్సెస్ లు సాధించలేకపోతున్నాడు. బుల్లితెరపై హోస్ట్ గా మాత్రం ఆయన దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ షోతో స్టార్ డమ్ తో పాటు, భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నాడు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, నాగార్జున నికర ఆస్తి విలువ సుమారు 3700 కోట్లకు పైనే ఉన్నట్టు సమాచారం. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ముందు ఉండగా..ఆ తర్వాత స్థానంలో నాగార్జున నిలిచారు. నటుడిగా కాకుండా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్‌గా, వేర్వేరు రంగాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. అత్యధిక ఆస్తులున్న భారతీయ నటుల టాప్ 10 జాబితాలో నాగార్జున స్థానం సంపాదించారు.టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా నిలిచారు. నాగార్జునను చూసే ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రెటీలు వ్యాపారంలోకి దిగారు. బ్యాడ్మింటన్ లీగ్, ఫుట్‌బాల్ లీగ్‌లలో ఒక్కో జట్టుకు యజమానిగా. అన్నపూర్ణ స్టూడియో తో పాటు , అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్, ఎన్ కన్వెన్షన్ సెంటర్స్, రెస్టారెంట్స్‌ను కూడా ఆయన నిర్వహిస్తున్నారు.
56
కింగ్ నాగార్జున రెమ్యునరేషన్
నాగార్జున ఒక్కో సినిమాకు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే కల్యాణ్ జ్యూవెల్లరీస్ వంటి బ్రాండ్ ఎండ్‌ఓర్స్మెంట్స్ తో పాటు కొన్ని వ్యాపారాలలో కూడా నాగార్జున పార్ట్నర్ గా ఉన్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌లో 50 కోట్ల విలువైన ఇల్లు, 200 కోట్ల విలువైన సినీ స్టుడియోతో పాటు హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా ఆస్తులున్నాయట కింగ్ కు. కార్ల విషయానికొస్తే.. 1.5 కోట్ల విలువైన బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ , 90 లక్షల విలువైన ఆడి ఎ7 , త పాటు కోటి 76 లక్షల విలువైన బీఎమ్‌డబ్ల్యూ ఎమ్6 వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజ్ లో ఉన్నాయి.
66
బుల్లితెరపై హోస్ట్ గా సక్సెస్
సినిమాలు, వ్యాపారాలతో పాటు బుల్లితెరపై కూడా నాగార్జున సత్తా చాటారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోనుహోస్ట్ చేసిన నాగార్జున, ప్రస్తుతం "బిగ్ బాస్ తెలుగు" షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున గత సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకూ షోను నడిపారు. ఈసారి బిగ్ బాస్ కోసం దాదాపు 35 కోట్లు రెమ్యునరేషన్ ఆయన తీసుకున్నట్టు సమాచారం. హీరోగా నటిస్తూనే.. తమిళ సినిమాల్లో విలన్ గా కూడా అలరించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో సైమన్ పాత్రలో అదరగొట్టాడు నాగ్. ప్రస్తుతం తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈసినిమాలో సాలిడ్ హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు నాగార్జున.