ఆదిపురుష్ చిత్రంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. రామాయణ పురాణ గాధతో తెరకెక్కించిన చిత్రం కావడంతో ఇందులోని పాత్రలు, దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన విధానం, డైలాగ్స్ పై ఆడియన్స్ లో ఫోకస్ ఎక్కువగా ఉంది. అలాగే గ్రాఫిక్స్ పై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే తప్ప.. చాలా అంశాల్లో ఆదిపురుష్ చిత్రం రామాయణానికి భిన్నంగా విచిత్రంగా ఉందని నెటిజన్లు, హిందూ వాదులు అభిప్రాయ పడుతున్నారు.