ఈ నేపథ్యంలో అనూహ్యంగా, అందరిని ఆశ్చర్యపరుస్తూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారని గతేడాది నుంచి వార్తలొస్తున్నా, వాటిని రహస్యంగా ఉంచుతూ, ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్‌తో ఓపెన్ అయ్యారు. గత వారం వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. మెగా ఫ్యామిలీతోపాటు సన్నిహితులు ఈ ఎంగేజ్‌మెంట్‌కి హాజరయ్యారు. త్వరలో ఈ ఇద్దరు పెళ్లిపీఠలెక్కబోతున్నారు.