చెక్కు చెదరని అందం.. గ్రీన్ శారీలో రమ్యకృష్ణ బ్యూటీఫుల్ లుక్.. అది చీరతోనే సాధ్యమంటూ..

First Published | Jun 16, 2023, 7:16 PM IST

సీనియర్ నటి రమ్యకృష్ణ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా గ్రీన్ శారీలో బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. లేటెస్ట్ పిక్స్ లో మంత్రముగ్ధులను చేసింది. 
 

కొన్నేండ్ల పాటు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రమ్యకృష్ణ (Ramya Krishnan) ఊపూపిన విషయం తెలిసిందే.  తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషల చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పటి స్టార్ హీరోల సరసన మెప్పించింది. ప్రస్తుతం సెంకడ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
 

ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ‘బాహుబలి’తో రమ్యకృష్ణ మరోసారి తన సత్తా చూపించారు. అద్భుతమైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో శివగామీగా ముద్రవేసుకున్నారు. కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించి వరుస చిత్రాలతో అలరిస్తోంది. 
 


ఈ సందర్భంగా వెండితెరపై విభిన్న పాత్రలతో అలరిస్తూనే వస్తోంది. అాలాగే సోషల్ మీడియాలోనూ రమ్యకృష్ణ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది.
 

చిత్రపరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అనిపించిన రమ్యకృష్ణ ఇప్పటికీ అదే బాటలో నడుస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. యంగ్ హీరోయిన్లకు పోటీగా సీనియర్ నటి అందంగా మెరుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
 

తాజాగా సీనియర్ భామ చీరకట్టులో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. గ్రీన్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కట్టిపడేసింది. మత్తు చూపులు, చెక్కు చెదరని అందంతో మతులు పోగొట్టింది. ఇప్పటికీ రమ్యకృష్ణ ఇంతలా ఆకట్టుకుంటుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే కేవలం చీరలోనే మోడ్రన్ గానూ, హాట్ గానూ కనిపించే అవకాశం ఉందంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 
 

ఐదు పదుల వయస్సులోనూ మరింత అందంగా మెరుస్తుండటంతో మంత్రముగ్ధులు అవుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక లైగర్ తర్వాత రమ్యకృష్ణ ‘రంగమార్తాండ’ చిత్రంతో అలరించింది. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 
 

Latest Videos

click me!