ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో జరీనా వహాబ్ కూడా నటిస్తున్నారు, ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు. కాగా ఈ మధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి, షూటింగ్ టైమ్ లో సెట్ లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు,
అంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఎక్కడా గర్వం ఉండదని ఆమె అన్నారు. అంతే కాదు వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి వారిలో ఒకరు సూరజ్ అయితే మరొకరు ప్రభాస్ అయి ఉండాలి అని జరీనా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.