సమంత ఇలా షాక్ ఇచ్చిందేంటి ? తన కష్టానికి ఫలితం లేకపోవడంతో..

Published : Apr 18, 2025, 02:04 PM IST

సమంతకి నటిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలతో సమంత మరింతగా మీడియాలో వైరల్ అయ్యారు. సమంత అనారోగ్యానికి గురై కోలుకుంది.

PREV
15
సమంత ఇలా షాక్ ఇచ్చిందేంటి ? తన కష్టానికి ఫలితం లేకపోవడంతో..
Samantha

సమంతకి నటిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలతో సమంత మరింతగా మీడియాలో వైరల్ అయ్యారు. సమంత అనారోగ్యానికి గురై కోలుకుంది. ఆమె మయోసైటిస్ ప్రభావానికి గురైన సంగతి తెలిసిందే. ఇలా అనేక సమస్యలు సమంతని చుట్టుముట్టాయి. 

25

ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలని తెలుగులో పూర్తి చేసింది. ఖుషి తర్వాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఖుషి రిలీజ్ అయింది 2023లో. అంటే సమంత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఖుషి తర్వాత ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించింది. అదే సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడింది. 

35
Citadel: Honey Bunny

వరుణ్ ధావన్ తో కలసి యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ కూడా చేసింది. అంత కష్టపడ్డప్పటికీ సమంతకి తగిన ప్రతిఫలం దక్కలేదు. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. 

45
Citadel: Honey Bunny

అయితే అమెజాన్ ప్రైమ్ సంస్థ సిటాడెల్ సీజన్ 2 ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది అట. కానీ సమంత ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకి సిటాడెల్ పై ఆసక్తి లేదని సీజన్ 2లో నటించనని తేల్చేసిందట. వరుణ్ ధావన్ కి కూడా సిటాడెల్ పై ఆసక్తి లేనట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్ కూడా సిటాడెల్ సీజన్ 2కి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

55

దీనితో అమెజాన్ ప్రైమ్ సంస్థ సీజన్ 2 ని తెరకెక్కించే ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎంత కష్టపడినా ఫలితం లేని ప్రాజెక్టు ఎందుకు అనేది సమంత ఉద్దేశం. ఇదిలా ఉండగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఫామిలీ మ్యాన్ 2తో సమంతకి దెస వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories