ఆనంది వరంగల్ కి చెందిన అమ్మాయి. గతంలో ఆమె శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. శివంగి చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పడడంతో చెలరేగిపోయింది. డైలాగ్ చెప్పే విధానంలో కానీ, వార్నింగ్ ఇచ్చే సన్నివేశాల్లో కానీ చాలా కాన్ఫిడెంట్ గా నటించింది. కథ ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఆనంది ఈ మూవీలో సత్యభామ అనే అమ్మాయిగా నటించింది.