Thalapathy67లో త్రిష కన్ఫమ్.. 14 ఏళ్ల తర్వాత వెండితెరపైకి మ్యాజికల్ పెయిర్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

First Published | Feb 1, 2023, 3:51 PM IST

తమిళ స్టార్ విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబోలో Thalapathy67 రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా త్రిషను కన్ఫమ్ చేస్తూ మేకర్స్ అఫిషీయల్ అప్డేట్ అందించారు
 

తమిళ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) రెండోసారి నటించబోతున్నారు. రెండేండ్ల కింద వచ్చిన ’మాస్టర్‘కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఈ కాంబో ఎప్పుడు రిపీల్ అవుతుందా? అని ఎదురుచూడగా.. ’ఖైదీ‘,’విక్రమ్‘ బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత లోకేష్ విజయ్ తో సినిమాను అనౌన్స్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో విజయ్ సరసన ఏ హీరోయిన్ నటించబోతున్నందనే అంశం ఆసక్తికరంగా మారింది.
 

తమిళంలో త్రిష- విజయ్ జంటగా.. 2004లో గిల్లి,  2005లో తిరుపాచి, 2006లో ఆతి,  2008లో కురువి వచ్చాయి. మళ్లీ 14 ఏండ్ల తర్వాత ఈ చిత్రం వస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో విజయ్, త్రిషతో పాటు.. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తోంది. ఇక విజయ్‌తో త్రిషకు ఇది ఐదవ సినిమా కావడం విశేషం. 
 


సీనియర్ హీరోయిన్ త్రిషతో నిత్యం వినిపిస్తుండగా.. తాజాగా కన్ఫమ్ చేస్తూ మేకర్స్ అఫిషీయల్ అనౌన్స్ మెంట్ అందించారు. 7స్క్రీన్ స్టూడియో ట్వీటర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.  త్రిషను దళపతి67 చిత్రంలోకి స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు త్రిష, విజయ్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే 14 ఏండ్ల తర్వాత ఈ మ్యాజికల్ పెయిర్ మళ్లీ అలరించబోతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. 
 

సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువల పరంగా ఈ చిత్రం భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేషన్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక దళపతి67ను 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా రానున్నాయి. అయితే ప్రస్తుతం చిత్ర యూనిట్ కాశ్మీర్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సత్యరాజ్, త్రిష, తదితరులు కూడా ఈ చిత్ర షూటింగ్ కోసం కాశ్మీర్ కు బయల్దేరినట్టు తమిళ వీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక లోకేష్ LCUలో ఈ చిత్రం భాగమనే అంటున్నారు. ఈ రకంగానూ సినిమాపై అంచనాలు పెంచేశారు.

Latest Videos

click me!