పింక్ డ్రెస్ లో హోమ్లీ బ్యూటీ గ్లామర్ మెరుపులు.. అదిరిపోయే పోజులతో మెస్మరైజ్ చేస్తున్న సీనియర్ నటి

First Published | Feb 1, 2023, 2:41 PM IST

హోమ్లీ బ్యూటీ స్నేహా (Sneha) రోజురోజుకు మరింత అందంగా మెరిసిపోతున్నారు. వయస్సు పెరిగుతున్నా రెట్టింపు గ్లామర్ తో మంత్రముగ్ధులను చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి పింక్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది.

సీనియర్ నటి స్నేహా కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. హీరోయిన్ గా కొన్నేండ్ల పాటు సౌత్ ఆడియెన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. కుటుంబ నేపథ్య చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.
 

స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో వెలుగొందింది నటి స్నేహ. తెలుగులోని స్టార్ హీరోల సరసన నటించి స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ‘ప్రియమైన నీకు, తొలి వలపు, హనుమాన్ జంక్షన్, వెంకీ, రాధా గోపాలం, శ్రీరామదాసు,  పాండురంగడు’ వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది.


ప్రస్తుతం కీలక పాత్రల్లో నటిస్తున్న స్నేహా.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళ్తున్నారు. వదినగా, అక్కగా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ అదరగొడుతున్నారు. 

అందరూ మెచ్చే స్నేహా నెట్టింట గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. చెక్కుచెదరని అందంతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది.  తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకున్నారు. 
 

స్నేహా తాజాగా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. పింక్ డ్రెస్ లో హోయలు పోయిన సీనియర్ నటి స్నేహా అందానికి నెటిజన్లు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ మేరకు ఆమె బ్యూటీని పొగుడుతూ ఫొటోలను లైక్ చేస్తున్నారు. కామెంట్లతో స్నేహాను ఆకాశానికి ఎత్తుతున్నారు. 

నాలుగు పదుల వయస్సులోనూ స్నేహా మునపటిలాగే కనిపిస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక స్నేహా కూడా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తోంది. భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. సినిమాలపైనా ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ‘క్రిస్టోఫర్’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది.
 

Latest Videos

click me!