సునయన తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పెళ్లికి ముందు ప్రేమకథ, రాజా రాజ చోర, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించింది.