అయితే నిజం ఏంటంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించినవి అని తేలింది.ఈ వైరల్ ఫోటోలో రష్మిక, హార్దిక్ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. రష్మిక నుదుట సింధూరం కూడా ఉంది. ఈ ఫోటో నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకో ఫోటోలో ఇద్దరూ దుబాయ్ దుస్తుల్లో ఉన్నారు. Hardik Pandya Fans అనే ఫేస్బుక్ పేజీలో ఈ ఫోటో షేర్ చేశారు. "హార్దిక్, రష్మిక దుబాయ్లో ఉన్నట్టుగా అందులో రాసుకొచ్చారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు.