కతార్‌లో కొత్త ఇల్లు కొన్న సైఫ్ అలీ ఖాన్, మీడియాతో ఏం చెప్పారంటే?
కత్తి దాడి తర్వాత, సైఫ్ అలీ ఖాన్ కతార్‌లో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఇంటికి సబంధించి ఆయన మీడియాతో ఏమాన్నారంటే?
కత్తి దాడి తర్వాత, సైఫ్ అలీ ఖాన్ కతార్‌లో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఇంటికి సబంధించి ఆయన మీడియాతో ఏమాన్నారంటే?
ముంబైలో భార్య కరీనాతో కలిసి, సైఫ్ అలీ ఖాన్ ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. మూడు నెలల క్రితం, ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ఈ సంఘటన తర్వాత సైఫ్ అలీ ఖాన్ కొత్త ఇంటిని కొనుగోలు చేయడమే కాకుండా, ఈ విషయాన్ని ఆయన అందరితో పంచుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ కతార్‌లో కొనుగోలు చేసిన కొత్త ఇంటి గురించ బాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవల అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సైఫ్ మాట్లాడారు. కతార్‌లోని తన కొత్త ఇంటి గురించి సమాచారాన్ని పంచుకున్నారు. కతార్ దేశం గురించి మాట్లాడుతూ, అక్కడ చాలా సురక్షితంగా అనిపించిందని, ఇంటి నుండి దూరంగా మరొక ఇంట్లో ఉన్నట్లు అనిపించిందని అన్నారు.
సైఫ్ అలీ ఖాన్ ఇటీవల కొనుగోలు చేసిన కొత్త ఇల్లు కతార్‌లోని దోహాలో ఉన్న సెయింట్ మార్సా అరేబియా ద్వీపం, ది పెర్ల్‌లో ఉందని చెబుతున్నారు. ఈ ఇంటికి సబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొత్త ఇంట్లో నివసించే అనుభవాన్ని సైఫ్ అలీ ఖాన్ పంచుకుంటూ ఇది చాలా బాగుంది అన్నారు. ఈ ఇల్లు పెద్దగా దూరంలో లేదు. ఇండియా నుంచి అక్కడికి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. సులభంగా చేరుకోవచ్చు. అంతే కాదు ఇది చాాలా సురక్షితమైనది మరియు ఇక్కడ నివసించడం చాలా బాగుంది. ఒక ద్వీపం లోపల మరొక ద్వీపం అనే భావన చాలా అద్భుతంగా ఉంది అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సైఫ్ అలీ ఖాన్‌కు అనేక ఆస్తులు ఉన్నాయి. ముంబైలో అమీర్ ఖాన్ నిబాంద్రాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్నారు. . హర్యానాలోని పటౌడిలో అతనికి పటౌడి ప్యాలెస్ ఉంది. లండన్ మరియు గస్టాడ్‌లలో కూడా సైఫ్ అలీ ఖాన్‌కు ఇళ్ళు ఉన్నాయి.