కొడుకు, భర్తపై నటి సుధ సంచలన వ్యాఖ్యలు.. నన్ను ఒంటరిని చేశారు, వాళ్లకూ అదే పరిస్థితి తప్పదు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 23, 2022, 12:52 PM IST

టాలీవుడ్ లో ఒకప్పుడు తల్లి, అత్త, వదిన ఇలాంటి పాత్రల్లో నటించాలి అంటే దర్శకనిర్మాతల మదిలో మొదట మెదిలే పేరు సుధ. దశాబ్దాల కాలం నుంచి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చెరగని వేశారు. సౌత్ లో ఆమె వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు.

PREV
16
కొడుకు, భర్తపై నటి సుధ సంచలన వ్యాఖ్యలు.. నన్ను ఒంటరిని చేశారు, వాళ్లకూ అదే పరిస్థితి తప్పదు

టాలీవుడ్ లో ఒకప్పుడు తల్లి, అత్త, వదిన ఇలాంటి పాత్రల్లో నటించాలి అంటే దర్శకనిర్మాతల మదిలో మొదట మెదిలే పేరు సుధ. దశాబ్దాల కాలం నుంచి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చెరగని వేశారు. సౌత్ లో ఆమె వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే నటి సుధ లైఫ్ లో కూడా ఊహించని కష్టాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధ తన ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

26

తాను నటిగా పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదించినట్లు సుధ తెలిపారు. కానీ ఆ డబ్బునంతా వ్యాపారాలు చేసి పోగుట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో హోటల్ పెట్టాను. మంచి లాభాలు వచ్చాయి. అదే ఉత్సాహంతో మరో హోటల్ కూడా పెట్టాను. నష్టాలు వచ్చి చాలా పోగొట్టుకున్నాను. 

36

కొన్నేళ్ల పాటు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. కానీ కుటుంబ సమస్యల కారణంగా చెన్నైకి మారాల్సి వచ్చింది. చిన్నప్పుడే మా అమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది. నన్నే అన్నాను చూసుకున్నారు. మా నాన్న చనిపోయిన తర్వాత నాకు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది. నాన్న క్యాన్సర్ కారణంగా మరణించారు. 

46

నా భర్త, కొడుకు నన్ను వదిలేసి దూరంగా యుఎస్ లో ఉంటున్నారు. నేను ఇప్పుడు నా భర్త కోసమో, కొడుకు కోసమో భాదపడడం లేదు. మా నాన్న కోసం బాధపడుతున్నా. రేపటి రోజున నా పరిస్థితే వాళ్లకు కూడా వస్తుంది. నా కోసం తప్పకుండా బాధపడతారు. ఆరోజున నేను ఉండకపోవచ్చు కానీ.. తప్పకుండా వాళ్లకు లైఫ్ అంటే ఏంటో తెలిసొస్తుంది అంటూ సుధ హాట్ కామెంట్స్ చేసింది. 

56

ఇలా తన ఫ్యామిలీ తనని ఒంటరి చేయడం గురించి చెప్పుకుంటూ నటి సుధ ఎమోషనల్ అయింది. నేను సైలెంట్ గానే ఉంటా. నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం. అది స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుంది. జీవితం అంటే ఏంటో తెలియజేస్తుంది అని సుధ అన్నారు. 

66

ప్రస్తుతం కొత్త ఆర్టిస్టులు రావడంతో నటి సుధకు కొంతమేర అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో తల్లి పాత్రల్లో ప్రగతి, పవిత్ర లోకేష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. 

click me!

Recommended Stories