బ్లాక్ టాప్ లో.. బ్యాక్ అందాలతో ‘సలార్’ నటి రచ్చ.. కిల్లింగ్ లుక్స్

First Published | Sep 26, 2023, 6:59 PM IST

తమిళ నటి శ్రియా రెడ్డి ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో నటిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తరుచూ కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
 

పవర్ ఫుల్ లేడీ శ్రియా రెడ్డి (Sriya Reddy) తమిళం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమురై, బ్లాక్, తిమిరు, కంచివరం వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ప్రేక్షకులల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
 

ఇటు తెలుగులోనూ ‘అప్పుడప్పుడు’, ‘అమ్మ చెప్పింది’ సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత మళ్లీ కోలీవుడ్, మలయాళం చిత్రాల్లో సందడి చేస్తూ వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న  OGలో ఈ పవర్ ఫుల్ లేడీ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్’లోనూ కీ రోల్ లో కనిపించనుంది. 
 

ఇలా భారీ చిత్రాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారనుంది. ఇప్పటికే ఆమె నటనతో కోలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ భారీ సినిమాలు విడుదల తర్వాత మరిన్ని చిత్రాల్లోనూ మెరిసే అవకాశం లేకపోలేదు. 
 

ఇదిలా ఉంటే.. శ్రియా రెడ్డి ఓవైపు వెండితెరపై మెరుస్తూ ప్రేక్షకులను తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తరుచూగా కనిపిస్తూ ఖుషీ చేస్తోంది. కిర్రాక్ లుక్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది.ఎక్కువగా వర్కౌట్స్ వీడియోలు, ట్రావెలింగ్ పోస్టులతో నెట్టింట మెరుస్తుంటుంది శ్రియా రెడ్డి. 
 

ఇక తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. గ్లామర్ మెరుపులు మెరిపించింది. బ్లాక్ టాప్ లో బ్యాక్ అందాలను చూపిస్తూ ఆకట్టుకుంది. మత్తు చూపులతో మైమరిపించింది. బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఆమె పిక్స్ ను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!