నటి శ్రీదేవి
శ్రీదేవి, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఆరాధించే నటి. లేడీ సూపర్ స్టార్‌గా చాలా సంవత్సరాలు వెలుగొందిన ఆమె, తన సినీ జీవితంలో అనేక భాషల్లో అనేక సూపర్ హిట్ నటులతో కలిసి పనిచేశారు. అలాంటి కొద్దిమంది నటులతో ఆమెకు మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, తెర వెనుక కూడా మంచి అనుబంధం ఉండేది. అలాంటి ఒక నటుడి కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు.
అంతేకాకుండా శ్రీదేవి ఆ నటుడి కోసం ఆలయంలో పూజ కూడా చేశారట. ఆ నటుడు మరెవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. శ్రీదేవితో ఒకటి కాదు, రెండు కాదు, అనేక భాషల్లో 20కి పైగా చిత్రాలలో ఆయన నటించారు.
రజనీ
ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, రజనీకాంత్ ఆరోగ్యం కోసం శ్రీదేవి ఇదంతా చేశారట. 2011లో ప్రముఖ నటుడు రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న శ్రీదేవి, షిరిడీ సాయిబాబా పేరు మీద ఉపవాసం ఉన్నారు.
రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు. పూణే సాయిబాబా ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు.
2011లో రజనీకాంత్ ఆరోగ్యం చాలా దిగజారినప్పుడు, ఆయన రవికుమార్ దర్శకత్వంలో రానా సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అయితే, శ్రీదేవి ఉపవాసం, అందరి అభిమానుల ప్రార్థనల వల్ల రజనీకాంత్ తిరిగి ఆరోగ్యం పొందారు.
రజనీకాంత్
రజనీకాంత్, శ్రీదేవి కలిసి అనేక చిత్రాలలో నటించారు, వాటిలో చాలా బ్లాక్‌బస్టర్‌లు. మూండ్రు ముడిచు, నాన్ ఆడిమై ఇల్లై, పోకిరి రాజా, భగవాన్ దాదా, షల్బాస్ వంటి చిత్రాలు వారు కలిసి నటించిన మెగాహిట్ చిత్రాలు. శ్రీదేవి తన 15వ ఏట రజనీకాంత్‌తో కలిసి పనిచేశారు.
ఒకానొక సమయంలో రజనీకాంత్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. అయినప్పటికీ, ఈ ఇద్దరు స్టార్స్ మధ్య స్నేహం ఎప్పటిలాగే ఉంది.
రజనీ, శ్రీదేవి
శ్రీదేవితోనే కాదు, ఆమె తల్లితో కూడా మంచి అనుబంధం పెంచుకున్నారు రజనీకాంత్. తొలినాళ్లలో కమల్ హాసన్ లాగా నేను కూడా మంచి నటుడిగా, ఆయనలా మంచి పారితోషికం తీసుకుంటానా అని శ్రీదేవి తల్లి దగ్గర తరచుగా బాధపడేవారట రజనీకాంత్. దానికి కలత చెందకు నాయనా, నువ్వు కమల్ హాసన్ కంటే మంచి నటుడిగా ఎదుగుతావని చాలాసార్లు ఆయనను ఆశీర్వదించారట శ్రీదేవి తల్లి.