ఎనిమిది సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలా.. ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎంతో తెలుసా?

First Published | Jul 8, 2023, 1:26 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) తాజాగా క్యూట్ లుక్స్ లో నెట్టింట దర్శనమిచ్చింది. ప్రస్తుతం అరడజన్ కు పైగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెంచేస్తోంది.
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో దుమ్ములేపుతోంది. వరుస చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. అతి తక్కువ సమయంలోనే అగ్రస్థాయి హీరోల సరసన నటించే ఛాన్స్ పొందడం సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి. 
 

ప్రస్తుతం శ్రీలీలా తెలుగులో ఏడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే కన్నడలోనూ ఓ సినిమా చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ కన్నడలో నాలుగు చిత్రాలు, తెలుగులో రెండు చిత్రాలు మాత్రమే చేసింది. ఈ ఆరు సినిమాలు కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసి ప్రేక్షకులను అలరించింది.
 


ఇప్పుడు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా శ్రీలీలా దూసుకెళ్తోంది. అయితే సినిమాల పరంగా జెట్ స్పీడ్ లో ఉన్న ఈకుర్ర భామ.. సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. 
 

తాజాగా క్యాజువల్ వేర్ లో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. మత్తెక్కించే ఫోజులతో, నిషా కళ్లతో మతులు పోగొడుతూ సందడి చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

అయితే, శ్రీలీలా సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయానికొస్తే.. ఇన్ స్టా గ్రామ్ లో ఈ ముద్దుగుమ్మకు 2.1 మిలియన్ల ఫాలోవర్స్  ఉన్నారు. ఇక ట్వీట్టర్ లో59కే ఫాలో అవుతున్నారు. ఈ విషయం కాస్తా వెనకబడే ఉందని చెప్పాలి. కానీ శ్రీలీలా నటిస్తున్న అన్నీ చిత్రాలు విడుదలైన తర్వాత మాత్రం నెట్టింట కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఓ రేంజ్ లో పెరగనుందనేది అర్థం అవుతోంది. ఆ మేరకు అదిరిపోయేలా పోస్టులు పెడుతూ వస్తోంది. 
 

ఇక శ్రీలీలా సినిమాల విషయానికొస్తో.. చివరిగా ‘ధమాకా’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం తెలుగులో ‘ఆదికేశవ’, ‘స్కంద’, ‘నితిన్32’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘వీడీ12’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు కన్నడలో ‘జూనియర్’ అనే మూవీలో లీడ్ రోల్ లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!