కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న జాన్వీ కపూర్.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Published : Jul 08, 2023, 01:25 PM IST

బాలీవుడ్ లో ఎలాగో పాతుకుపోయింది కదా.. ఇక సౌత్ పై గట్టిగా కాన్సంట్రేషన్ చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. టాలీవుడ్ ఎంట్రీ ఎలాగో ఇస్తుంది.. ఇక కోలీవుడ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకీ హీరో ఎవరో తెలుసా..? 

PREV
17
కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న జాన్వీ కపూర్.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా.. బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ స్టార్ జాన్వీ కపూర్. బాలీవుడ్ ఎంట్రీ అయితే ఇచ్చింది కాని.. అక్కడ సాలిడ్ హిట్ కొట్టలేకపోతోంది. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ.. కమర్షియాలిటీకి కాస్త దూరంగా సినిమాలు చస్తోంది. ఎక్కువగా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తోంది జాన్వీ కపూర్. 

27
Photo Courtesy: Instagram

ఈక్రమంలో ఎప్పటి నుంచో జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి డిస్కర్షన్స్ జరుగుతుండగా.. తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విధంగా సౌత్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంది జాన్వీ. ఈక్రమంలో అటు తమిళ సినిమాల్లోకి కూడా జాన్వీ కపూర్ అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 
 

37
Photo Courtesy: Instagram

తన తల్లి శ్రీదేవి పుట్టిన తమిళ ఇండస్ట్రీలో తాను కూడా స్టార్ గా వెలగాలి అనుకుంటుందో.. లేక ఒక్క సినిమా అయినా.. తన మాతృ భాషలో చేయాలి అనుకుంటుందో కాని.. తాజాగా తమిళ సినిమాకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా ఏ స్టార్ హీరోతోను కాదు. ఓ యంగ్ హీరో.. ఒక్క సినిమాతో సెన్సేషన హిట్ కొట్టిన కుర్ర హీరోతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట జాన్వీ కపూర్. 

47

ఇక వివరాల్లోకి వెళితే.. లవ్‌ టుడే సినిమాతో తమిళనాట మంచి గుర్తింపును తెచ్చుకున్న యంగ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్డు ప్రదీప్‌ రంగనాథన్‌. ప్రస్తుతం ఆయన నయనతార భర్త..యంగ్ డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ రొమాంటిక్‌ కామెడీ కధతో తెరకెక్కుతోంది ఈమూవీ  ఈసినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నారట టీమ్. 

57
Janhvi Kapoor

ఒక మొబైల్‌ ఫోన్‌ను వల్ల  టైమ్‌ ట్రావెల్‌ చేసి.. తన ప్రేమను గెలిపించుకున్న కుర్రాడి కథే ఈ సినిమా.. విక్కీ6 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా కథ చాలా కొత్తగా అనిపించడంతో.. జాన్వీ కపూర్ కూడా ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై  స్టార్ యాక్టర్ కమల్‌హాసన్‌ నిర్మించబోతున్నారు.
 

67

ఇక సౌత్ లోవరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటుందట జాన్వీ కపూర్. అంతే కాదు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా.. మంచి కథతో కూడిన కమర్షియల్ మూవీస్ చేసి.. స్టార్ గా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. అంతే కాదు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలని చూస్తుంది జాన్వీ. మరి ఆమె ఆశలు నెరవేరుతాయా లేదా అనేది చూడాలి. 

77

సినిమాల మాట అటుంచితే.. సోషల్ మీడియాలో మాత్రం నార్త్, సౌత్ అని లేకుండా.. ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఉన్నారు జాన్వీ కపూర్ కు. ఇన్ స్టాలో జాన్వీ అందాల ఆరబోత మామూలుగా ఉండదు మరి. ఏమాత్రం  మొహమాటపడకుండా.. నాటు అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది జాన్వీ కపూర్. ఈ విషయంలో శ్రీదేవి ఫ్యాన్స్ నుంచి విమర్షలు కూడా ఫేస్ చేసింది బ్యూటీ.  
 

Read more Photos on
click me!

Recommended Stories