మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!

First Published | Oct 20, 2021, 5:12 PM IST

సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితం ఊహించని విధంగా ఆగిపోయింది. విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు చైసామ్. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతో సమంత తీవ్ర నిరాశలోకి వెళ్ళింది.

సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితం ఊహించని విధంగా ఆగిపోయింది. విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు ChaySam. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతో సమంత తీవ్ర నిరాశలోకి వెళ్ళింది. దీనికి తోడు మీడియాలో Samantha, Naga Chaitanya విడాకులకు కారణాలు ఇవే అంటూ అనేక రూమర్లు ప్రచారం జరిగాయి. 

చివరకు సమంతకు తన స్టైలిస్ట్ Preetham సంబంధం ఉన్నట్లు కూడా ప్రచారం చేశారు. ఇలాంటి పుకార్లు సమంతకి తీవ్ర వేదనగా మారాయి. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు బ్రేక్ పడాలంటే తాను మౌనం వీడాలని సమంత డిసైడ్ అయింది.అందుకే తపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే సమంత వ్యక్తిగత జీవితంపై డిబేట్లు నడిపాయి. 'సమంత తప్పు చేస్తున్నావ్'.. 'సమంత విడాకులకు కారణం ఏంటి'.. ఇలాంటి థంబ్ నెయిల్స్ తో చిరాకు పుట్టించేలా పుకార్లుని ప్రచారం చేసాయి. 


సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణాలు ఎవ్వరికీ తెలియదు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో పాల్గొన్న వాళ్ళు సమంత, చైతు విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ కొన్ని విషయాలు పేర్కొన్నారు. సమంతనే తప్పు పడుతూ డిబేట్లు చేశారు. దీనితో సమంత రంగంలోకి దిగింది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ అయిన సుమన్ టివి, తెలుగు పాపులర్ టివి, టాప్ తెలుగు టివి యూట్యూబ్ ఛానల్స్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. 

Samantha

ఈ కేసుపై నేడు కూకట్ పల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ ఛానల్స్ తో పాటు అనలిస్ట్ సీఎల్ వెంకట రావు అనే వ్యక్తిపై కూడా సమంత పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. సమంత పరువు నష్టం దావా వేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్ లో ఒక యూట్యూబ్ ఛానల్ అదే పనిగా సమంత విడాకులకు కారణం ఏంటి అనే టాపిక్ పై కొందరు ప్రముఖులతో ఇంటర్వ్యూలో నడిపింది. 

ఈ ఇంటర్వ్యూలలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చే ఓ ప్రముఖ వ్యక్తి కూడా పాల్గొన్నారు. ఆమె సమంత.చైతు విడిపోవడానికి అనేక కారణాలు చెబుతూ.. సమంత సరోగసి విధానం ద్వారా మాత్రమే పిల్లలని పొందాలనుకుందని.. ఇది ఒక కారణం అయితే..ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించడం మరో కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా తనపై అసత్య కథనాలతో వార్తలు ప్రసారం చేసిన సదరు యూట్యూబ్ ఛానల్స్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. 

ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా సమంత చైతు నుంచి విడిపోయాక తన ప్రొఫెషనల్ వర్క్ తో బిజీ అయిపోయింది. ఓ వైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సన్నాహకాల్లో ఉంటూనే.. ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతోంది. తిరిగి నార్మల్ కావడానికి ప్రయత్నిస్తోంది. సమంత నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. అలాగే డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థలో ఓ చిత్రానికి సమంత కమిటైంది. 

Latest Videos

click me!