వనంలో వాలిన మమూరిలా ఆకర్షిస్తున్న సదా.. బ్యూటీఫుల్ లుక్ లో ‘జయం’ భామ మైమరిపించే పోజులు

First Published | Feb 10, 2023, 12:39 PM IST

‘జయం’ హీరోయిన్ సదా (Sadha) బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్నారు. సరికొత్త షో కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ కట్టిపడేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు అట్రాక్టివ్ గా ఉన్నాయి.
 

టాలీవుడ్ సీనియర్ నటి సదా సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించింది. కొన్నాళ్లు సౌత్ లో ఉపూపిన ఈ బ్యూటీ నాలుగేండ్లుగా సినిమాలకు దూరంగానే ఉంది. ప్రస్తుతం మళ్లీ ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.
 

చివరిగా ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో అలరించిన ఈ బ్యూటీ.. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. 
 


మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లతో అదరగొడుతున్నారు సదా. ఈక్రమంలో లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. బ్లూ లెహంగా, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలను విందు చేసింది. బ్యూటీఫుల్ గార్డెన్ లో నాట్యమయూరిలా దర్శనమిచ్చింది.
 

ట్రెడిషనల్ లుక్ లో మెరిసినప్పటికీ గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. టాప్ గ్లామర్ షోతో నెటిజన్లను మైమరిపించింది. సదా అందాల విందుకు అభిమానునలు ఫిదా అవుతున్నారు. దీంతో ఫొటోలను లైక్స్, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు. ‘జయం’ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

అయితే సదా ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తను జడ్జీగా వ్యవహరిస్తున్న ‘బీబీ జోడీ’డాన్స్ షోకోసం ఇలా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్లతో ఈ షోలో స్టార్ మాలో ప్రసారం అవుతోంది. 
 

ప్రస్తుతం సదా ఎలాంటి సినిమాలకు సైన్ చేసినట్టు అప్డేట్ మాత్రం రాలేదు. కానీ ఫ్యాన్స్ ను బుల్లితెర వేదికగా అలరిస్తూనే ఉన్నారు. పాపులర్ డాన్స్ షో Dhee జూనియర్స్, జోడీ స్పెషల్ షోలకు జడ్జీగా వ్యవహరించారు. ప్రస్తుతం ‘బీబీ జోడీ’లో కనిపిస్తున్నారు.  

Latest Videos

click me!