ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ కి అయినా.. ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు తప్పవు..అవమానాలు తప్పవు. అలాంటి ఇబ్బందుల గురించి వెల్లడించింది బాలీవుడ్ స్టార్ కిడ్.. స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్.
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ అయినంత మాత్రాన అంతా సవ్యంగా ఉంటుంది అని అనుకోవడానికి లేదు. స్టార్ కిడ్ అయినంత మాత్రాన అన్ని వచ్చి చేతిలో పడవు. వారికి కూడా ఇబ్బందులు తప్పవు.. టాలెంట్ ఉన్నా కూడా. అవమానాలు తప్పువు. ఈక్రమంలోనే తన జీవితంలో జరిగిన ఘోర అవమానాల గురించి వివరించింది స్టార్ కిడ్... దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.
27
దివంతగ స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి తనయురాలు.. వారసత్వం తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. టాలెంట్ తో దూసుకుపోతుంది జాన్వీ.. హీరోయిన్ గా కమర్షియల్ ఆలోచనలు పక్కన పెట్టి.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తోంది. సక్సెస్ ఉన్నా లేకున్నా.. తనకంటూ బాలీవుడో స్పెషల్ మార్క్ ను మాత్రం వేసుకుంది జాన్వీ.
37
అంతే కాదు.. సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది బ్యూటీ.. వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకెళ్తోంది. ఈక్రమంలో ఫణిల్మ్ ఇండస్ట్రీలో తన ఎంట్రీ అంత ఈజీగా జరగలేదుంటోంది బ్యూటీ. ఎన్నో అవమానాలు ఎదుుర్కోని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చానంటోంది జాన్వీ కపూర్. వాటి గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకోచ్చింది బ్యూటీ.
47
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని వాపోయింది జాన్వీ కపూర్. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను ఎదుర్కొన్న సూటిపోటి మాటల గురించి బయటపెట్టింది. వాటి గురించి జాన్వీకపూర్ మాట్లాడుతూ..నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నన్ను అందరు నెపోకిడ్ నెపోకిడ్ అని విమర్శించారు. ఇక నా మూవీ రిలీజ్ అయిన ప్రతీసారి నెపోకిడ్.. యాక్టింగ్ రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావ్? అంటూ కామెంట్స్ చేశారు అంటూ బాధపడింది.
57
అంతే కాదు.. మరికొంత మంది ఇంకాస్త హద్దులు దాటి ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేశారు అంటూ వాపోయింది బ్యూటీ. ఆ విమర్షలు తలుచుకుని ఎంతో బాధపడ్డాను అంటుంది జాన్వీ. అందరు నెపోకిడ్.. నెపోకిడ్ అని చూస్తారే తప్ప.. నా నటనను ఎవరూ చూడరు అంటూ బాధపడింది జాన్వీకపూర్.
67
Image: Janhvi Kapoor / Instagam
ఇక ప్రస్తుతం సొసైటీలో కొంత మంది వ్యాక్తులు ఇదే పనిగా పెట్టుకున్నారు.. ఎదుటివారిలో ఏదో ఒక తప్పును వెతికే పనిలోనే ఉంటారని జాన్వీ చెప్పుకొచ్చింది. వాళ్లు అలా చేయబట్టే.. నాలాంటి వాళ్ళు ఇలా సోషల్ మీడియాలో బుక్ అవ్వాల్సి వస్తుంది అన్నారు. కాని ఎంతకాలం వీళ్ళ ఆటులు సాగవు.. ఇలాంటివి చదివి.. చదివి జనాలకు కూడా విసుగు వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చింది జాన్వీ కపూన్.
77
అంతే కాదు.. నాకు నా బలాలు బలహీనతలు తెలుసు. కాబట్టి వాళ్ల విమర్శలను పట్టించుకోవడం మానేసి.. నా పని నేను చేసుకుంటున్నాను అన్నారు జాన్వీకపూర్. ప్రస్తుతం జాన్వీకపూర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.