Farzi Web Series Review: ఫార్జీ వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

First Published | Feb 10, 2023, 11:46 AM IST


టాప్ స్టార్స్ వెబ్ సిరీస్ల బాట పడుతున్నారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తన డెబ్యూ వెబ్ సిరీస్ ఫార్జీ తో ప్రేక్షకులతో పలకరించారు. అమెజాన్ ప్రైమ్  ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన ఫార్జీ ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ అవుతుంది. 
 

Farzi Review

దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ అండ్ యాక్షన్ సిరీస్ ఫార్జీ. విజయ్ సేతుపతి, కేకే మీనన్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు చేశారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ తో యాక్షన్ లవర్స్ ని ఆకర్షించిన దర్శకుల నుండి వస్తున్న ఈ సిరీస్ పై సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ క్యాస్ట్ నటించడంతో హైప్ మరింతగా పెరిగింది. మరి ఫార్జీ ప్రేక్షకులను మెప్పించిందా... 
 

Farzi Review

కథ:

తండ్రి నిరాదరణకు గురైన సన్నీ (షాహిద్ కపూర్) తాత (అమోల్ పాలేకర్)వద్ద పెరిగి పెద్దవాడు అవుతాడు. సన్నీ తాతయ్యకు ఒక ప్రెస్ ఉంటుంది. ఆయన పత్రికకు మార్కెట్ లో డిమాండ్ ఉండదు. నష్టాల్లో కూరుకుపోయిన ప్రెస్ అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సన్నీ గొప్ప ఆర్టిస్ట్. పెయింటింగ్స్ వేసి స్ట్రీట్స్ లో అమ్ముతూ ఉంటాడు. తన కళకు కూడా తగిన గుర్తింపు రాదు. డబ్బులేక జీవితంపై విరక్తి చెందిన సన్నీ... ఒక క్రిమినల్ ఆలోచన చేస్తాడు. ఫ్రెండ్ ఫిరోజ్ తో కలిసి తన టాలెంట్ వాడి దొంగ నోట్లు ప్రింట్ చేయాలి అనుకుంటాడు.


Farzi Review


తన ప్రణాళిక అమలు చేస్తాడు. సన్నీ తన టాలెంట్ తో ఒరిజినల్ నోట్లకు ఏమాత్రం తీసిపోని క్వాలిటీతో కూడిన దొంగనోట్లు తయారు చేస్తాడు. సన్నీ టాలెంట్ ఫేక్ కరెన్సీ మాఫియా కింగ్ మన్సూర్ దలాల్ (కే కే మీనన్) కి తెలుస్తుంది. సన్నీని తన వద్ద పనిచేయాల్సిందిగా ప్రపోజల్ పెడతాడు. ఈ ఫేక్ కరెన్సీ మాఫియాను అడ్డుకునేందుకు ప్రభుత్వ అధికారి మైఖేల్(విజయ్ సేతుపతి) రంగంలోకి దిగుతాడు. మైఖేల్ తన ఇన్వెస్టిగేషన్ కి ఆర్బీఐ ఎంప్లాయ్, ఫేక్ కరెన్సీ ఎక్స్పర్ట్ మేఘా(రాశి ఖన్నా) సహాయం తీసుకుంటాడు. 


ఆర్థిక అవసరాల కోసం తప్పుదోవ పట్టిన సన్నీ కథ ఎలా ముగిసింది? మేఘా సహాయంతో మైఖేల్ ఫేక్ కరెన్సీ మాఫియాను కట్టడి చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఫార్జీ వెబ్ సిరీస్ చూడాలి. 
 

Farzi Review

ది ఫ్యామిలీ మాన్ సిరీస్ తో తమ టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నారు రాజ్ అండ్ డీకే. టెర్రర్ నేపధ్యానికి ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్ జతచేసి వారు తెరకెక్కించిన ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1 అండ్ 2 ట్రెమండస్ సక్సెస్ సాధించాయి. ఫార్జీ సిరీస్ తో స్టోరీ టెల్లింగ్ లో  ఎక్స్పర్స్  అని మరోసారి రుజువు చేసుకున్నారు. 
 

Farzi Review


8 ఎపిసోడ్స్ తో కూడిన ఫార్జీ సిరీస్ ఉత్కంఠ రేపుతూ సాగుతుంది. స్టార్ క్యాస్ట్ తీసుకోవడంతో పాటు స్క్రీన్ స్పేస్ ఇచ్చి, బలమైన పాత్రలుగా మలిచి మాక్సిమమ్ వాడుకున్నారు. ముఖ్యంగా షాహిద్ కపూర్ అన్నీ తానై వ్యవహరించారు. విజయ్ సేతుపతి మరోసారి విలక్షణ నటుడిగా తన టాలెంట్ చూపించారు. మూడ్ స్వింగ్స్ చూపిస్తూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. 

Farzi Review


రియల్ టైం క్రైమ్ డ్రామాలు కథలుగా ఎంచుకోవడంతో పాటు కన్విన్సింగ్ గా తెరకెక్కించడం రాజ్ అండ్ డీకే ప్రధాన బలం. ఈ సిరీస్ కోసం ఫేక్ కరెన్సీ మాఫియాపై పెద్ద రీసెర్చ్ చేశారని అర్థం అవుతుంది. కొన్ని యదార్థ సంఘటనలు కథలో రాసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో పాటు యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా ఆకట్టుకుంటుంది. 
 

Farzi Review


మేఘా పాత్ర చేసిన రాశి ఖన్నా, ఫిరోజ్ గా కనిపించిన భువన్ అరోరా, కేకే మీనన్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉన్నత నిర్మాణ విలువలతో ఫార్జీ తెరకెక్కింది. సాంకేతిక విభాగాలైన ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మెప్పించాయి. బీజీఎమ్ తో సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. 
 


మొత్తంగా చెప్పాలంటే ఫార్జీ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కిన మరో అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్. ఉత్కంఠరేపే యాక్షన్,సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాతో పాటు ప్రధాన పాత్రలు చేసిన నటుల పెర్ఫార్మన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

రేటింగ్: 3/5

డైరెక్షన్: రాజ్ & డికె 
నటీనటులు: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి,కే కే మీనన్, రాశి ఖన్నా 

స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్: అమెజాన్ ప్రైమ్ 
 

Latest Videos

click me!