పొట్టి గౌన్ లో పిచ్చెక్కిస్తున్న సదా.. రానురాను యంగ్ గా మారుతున్న ‘జయం’ బ్యూటీ.. బ్యూటీఫుల్ లుక్

First Published | Jun 30, 2023, 1:07 PM IST

‘జయం’ హీరోయిన్ సదా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. సీనియర్ భామ మరింత అందంగా మారుతూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్  స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

సీనియర్ హీరోయిన్ సదా (Sada)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళంలో పాటు తెలుగులోనూ గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ను కూడా టాలీవుడ్ చిత్రం తోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. 
 

తొలుత జయం’ సినిమాతో నటి సదా తెలుగు ప్రేక్షకులకు పరిచయం  అయ్యింది. ఫస్ట్ సినిమాతోనే ఆడియెన్స్ ను కట్టిపడేసింది. గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి మార్కులు దక్కించుకుంది. ఆ తర్వాత సదాకు కోలీవుడ్, టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందాయి. 
 


అయితే, సదా నాలుగైదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. చివరిగా వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆఫర్లు కూడా తగ్గాయి. దీంతో వెండితెరకు కాస్తా గ్యాప్ వచ్చింది. దీంతో మళ్లీ ఎప్పుడూ తిరిగి బిగ్ స్క్రీన్ పై మెరుస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

చివరిగా సదా ‘టార్చ్ లైట్’ చిత్రంలో వేశ్య పాత్రలో నటించారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా అలరించిన సదా అలాంటి పాత్రలో అలరించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఏమైందో గానీ తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించలేదు. 

కానీ, తన అభిమానులను సోషల్ మీడియాలో ఎప్పుడూ అలరిస్తూనే వస్తోంది. వరుస పోస్టులు పెడుతూ ఫిదా చేస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తోంది. గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. 
 

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మినీ గ్రీన్ డ్రెస్ లో హోయలు పోయింది. ట్రెండీ లుక్ లో స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మరోవైపు థైస్ షోతో కుర్ర గుండెల్ని పిండేసింది. మత్తెక్కించే ఫోజులతో, బ్యూటీఫుల్ స్మైల్ తో చూపు తిప్పుకోకుండా చేసింది.
 

సోషల్ మీడియాలో మాత్రం ఇలా సదా చాలా కాలంగా సందడి చేస్తూనే ఉంది. ముఖ్యంగా యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. మరింత అందంగా తయారవుతూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ కూడా సదా పోస్టులకు లైక్స్, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. సదా మళ్లీ రీఎంట్రీకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే బుల్లితెరపై Dhee 14కు జడ్జీగా అలరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘హాలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ లోనూ లీడ్ రోల్ లో ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి సినిమాతో వస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos

click me!