ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై హీరోయిన్ సదా కామెంట్స్

Published : Aug 21, 2022, 03:27 PM IST

హీరోయిన్ సదా ఉదయ్ కిరణ్ తో కలసి 'ఔనన్నా కాదన్నా' చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తాజాగా ఇంటర్వ్యూలో సదా ఉదయ్ కిరణ్ ని గుర్తు చేసుకుంది. 

PREV
16
ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై హీరోయిన్ సదా కామెంట్స్

ఉదయ్ కిరణ్ జీవితం ఎంతటి విషాదకరంగా ముగిసిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉదయ్ కిరణ్ మాత్రమే. వరుస విజయాలు అందుకుంటూ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. 

26

హీరోయిన్ సదా ఉదయ్ కిరణ్ తో కలసి 'ఔనన్నా కాదన్నా' చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తాజాగా ఇంటర్వ్యూలో సదా ఉదయ్ కిరణ్ ని గుర్తు చేసుకుంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ..అతడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. ఉదయ్ కిరణ్ లాంటి నటుడిని కోల్పోవడం దురదృష్టకరం. 

36
Sadaa

మేమిద్దరం కలసి ఔనన్నా కాదన్నా చిత్రంలో నటించాం. మన జీవితంలో అన్ని ప్లాన్ ప్రకారం జరగవు. ఉదయ్ కిరణ్ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. మన లైఫ్ ప్లాన్ చేసుకున్న విధంగా జరగకపోతే ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళాలి. లైఫ్ అంతకంటే గొప్పది. చాలా మంది నటులు డిప్రెషన్ లోకి వెళుతున్నారు అనే వార్తలు వింటూనే ఉన్నాను. 

46

ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన, జీవితంలో ఒక విషయం అనుకున్న విధంగా జరగలేదని డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు అని సదా అన్నారు. జీవితంలో సాధించాల్సినవి ఇంకా మిగిలే ఉంటాయి అని అన్నారు. 

56

విజయాలు, పరాజయాలు మన చేతుల్లో ఉండవు. నటులుగా మన బెస్ట్ ఇవ్వాలి అంతే అని సదా అన్నారు. జయం చిత్రంతో సదా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో పల్లెటూరి యువతి లాగా లంగా ఓణిలో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. 

66

అనంతరం శంకర్ దర్శకత్వంలో ఆల్ టైం మెమొరబుల్ మూవీ ' అపరిచితుడు'లో నటించింది. ఆ తర్వాత సదా కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. వరుస పరాజయాలు ఎదురు కావడంతో నటిగా ఆమెకి ఆఫర్స్ తగ్గాయి. 

Read more Photos on
click me!

Recommended Stories