లెహంగా వోణీలో ‘జయం’ బ్యూటీ మెరుపులు.. సదా ఖతర్నాక్ ఫోజులకు ఫిదా అవ్వాల్సిందే..

First Published | Oct 19, 2023, 11:58 AM IST

‘జయం’ హీరోయిన్ సదా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. వరుసగా సంప్రదా దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. అందాల ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

సీనియర్ నటి సదా (Sadha)  చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. అదే సమయంలో బుల్లితెరపై వరుస షోలతో సందడి చేస్తూ వస్తోంది. ‘ఢీ’ షోకు జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘బీబీ జోడీ’లోనూ మెరిసింది. 
 

టీవీ షోల ద్వారా తన అభిమానులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటు  సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ వస్తోంది. అలాగే గ్లామర్ ఫొటోలనూ షేర్ చేసుకుంటూ రచ్చ చేస్తోంది. 


నాలుగు పదుల వయస్సు దాటినా సదా తన బ్యూటీఫుల్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. తరుచుగా  నయా లుక్స్ లో దర్శనమిస్తూ నెట్టింట సందడి చేస్తోంది. గ్లామర్ మెరుపులతోనూ ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. 
 


ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తున్న సదా మరింతగా క్రేజ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా లెహంగా వోణీలో మెరిసింది. డీప్ కట్ బ్లౌజ్, లెహంగా, మ్యాచింగ్ వోణీ ధరించి యంగ్ లుక్ ను సొంతం చేసుకుంది. తన అందంతో అట్రాక్ట్ చేసింది.

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సదా ఖతర్నాక్ ఫోజులతోనూ ఆకట్టుకుంటోంది. నడుము అందాలను చూపించేలా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. తన చిరునవ్వుతో వెలిగిపోయే అందానికి మరింత మెరుపులు దిద్దేద్దింది. కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. 

కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలో సదా గ్లామర్ పరంగా, నటన పరంగా సెన్సేషన్ గా మారింది. పైగా ఫస్ట్ సినిమాతోనే హిట్ పటడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళంలో కొన్నాళ్లు వెలిగిన సదా ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. 

ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మళ్లీ సినిమాలకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆఫర్లు అందుకుంటోంది.  ఐదేళ్ల తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టి వెండితెరపై మెరుస్తోంది. ఇటీవల సదా ‘అహింస’ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. 
 

డైరెక్టర్ తేజ దర్శకత్వం, అభిరామ్ హీరోగా వచ్చిన ‘అహింస’  చిత్రంలో సదా కీలక పాత్ర పోషించింది. మొత్తానికి ఇలా వెండితెరపై మెరిసి తన అభిమానులను ఖుషీ చేసింది. అంతకు ముందు ‘హాలో వరల్డ్’ అనే సిరీస్ లోనూ ప్రధాన పాత్ర పోషించింది. నెక్ట్స్ ఎలాంటి సినిమాతో అలరిస్తుందో చూడాలి.

Latest Videos

click me!