ఫ్యాన్స్ ప్రశ్నలకు రవితేజ ఆన్సర్స్, చెడుగుడు ఆడుకున్న మాస్ మహారాజా

Mahesh Jujjuri | Updated : Oct 19 2023, 10:58 AM IST
Google News Follow Us

వరుసగా ప్రశ్నల వర్షం కురిపించిన అభిమానులకు అదరిపోయే ఆన్సర్లు ఇచ్చి చుక్కలు చూపించాడు మాస్ మహారాజ్ రవితేజ. అడిగినవాటికి సమాధానాలు చెప్పడమే కాదు.. అందులో తనమార్క్ ఉండేలా చూసుకున్నాడు స్టార్ సీనియర్ హీరో. 
 

17
ఫ్యాన్స్ ప్రశ్నలకు రవితేజ ఆన్సర్స్, చెడుగుడు ఆడుకున్న మాస్ మహారాజా

60 ఏళ్లకు  అయిదేళ్ల దూరంలో ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ. అయినా ఆయన ఎంత  ఎనర్జిటిక్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాదేమో అంత హుషారుగా ఉండటం. మరి ఉత్తుత్తగనే అవ్వరు కదా మాస్ మహారాజ్ లు.. సినిమాల్లలో ఎంత జోరు చూపిస్తాడో..  బయట కూడా అంతే ఉంటాడు రవితేజ. అదే వెటకారంతో, వన్‌ లైనర్లతో ఆకట్టుకుంటాడు రవి. 

27

ఫ్యాన్స్ తో.. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ తో.. పక్కన ఉన్న అసిస్టెంట్ తో కూడా  అంతే జోవియల్‌గా ఉంటాడు. అదే ఫ్యాన్స్‌ మధ్యలోకి వస్తే ఇంకా ఆయన్ను పట్టుకోవడం కష్టమే. తాజాగా ఇదే విషయం రిపిట్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. రేపు(20 అక్టోబర్) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది మూవీ. 
 

37

ఈ సందర్భంగాదేశ వ్యాప్తంగా ప్రచారం చేసిన రవితేజ.. ఈప్రమోషన్లలో భాగంగా.. తన అభిమానులతో ఫేస్ టూ ఫేస్ కలిశాడు. ఈ క్రమంలో వాళ్ల ప్రశ్నలకు రవితేజ అదిరిపోయే  సమాధానాలు ఇచ్చి మెప్పించాడు. అసలు మీరు ఇంత ఎనర్జీగా ఎలా ఉంటారు. ఎలా ఉండగలుగుతున్నారు అని అసలు  సీక్రెట్ చెప్పమన్నాడు ఓ అభిమాని. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటాను.. అదే నాలో ఎనర్జీని తీసుకొస్తుంది. నెగెటివ్‌గా ఆలోచించేవారు ఎనర్జిటిక్‌గా ఉండలేరు అని అసలు సీక్రెట్ విప్పాడు రవితేజ. 

Related Articles

47

అంతే కాదు.. ఫ్యూచర్ లో ఇలాంటి పాత్రలు చేస్తారా అంటే.. అసలు నేను ఫ్యూచర్ గురించి ఆలోచించను.. బాధపడను.. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది నాకు ముఖ్యం.. అది పర్ఫెక్ట్ గా చేస్తే..ఫ్యూచర్ దానంతట అదే బాగుంటుంది అన్నారు రవితేజ. షాక్‌ సినిమా లాంటి ఎమోషనల్‌ సినిమాలో మళ్లీ మిమ్మల్ని చూడొచ్చా అంటే… చూద్దాం ఎప్పుడు జరుగుతుందో అని అన్నాడు.

57

ఇక ప్రస్తుతం ఆయన నటించిన టైగర్‌ నాగేశ్వరరావు గురించి అడుగుతూ.. ఓ అభిమాని.. ఈ సినిమాలో గూస్‌ బంప్స్‌ సీన్స్‌ ఉన్నాయా అని అడిగితే…?టీజర్‌, ట్రైలర్ చూసే ఉంటావ్‌ కదా నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా అంటూ తనదైన మార్క్ సమాధానం చెప్పాడు రవితేజ.

67

మీ అభిమాన నటి ఎవరు అని అడిగితే… ఆడవాళ్లంతా నా ఫేవరెట్‌ అంటూ భలే సమాధానం ఇచ్చాడు రవితేజ. ఫైనల్‌గా మీ ఫస్ట్‌ పాన్‌ ఇండియా సినిమా కదా అని అడిగితే…పాన్‌ ఇండియా అని వేరుగా అనొద్దు. ఇండియన్‌ ఫిల్మ్‌ అనండి చాలు అంటూ అదరిపోయే ఆన్సర్ ఇచ్చాడు రవితేజ.

77

రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో  తెరకెక్కిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా..స్టూవర్టుపురం గజదొంగ పేరు మోసిన టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందుతోంది. ఈసినిమా ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 20న రిలీజ్ అవ్వబోతోంది. 

Recommended Photos