తమిళ బ్యూటీ క్రేజీ లైనప్.. తెలుగులో బిజీ అవుతున్న ప్రియాంక మోహన్.. చీరకట్టులో బ్యూటీఫుల్ లుక్

First Published | Oct 19, 2023, 10:20 AM IST

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశం దక్కించుకుంటోంది. ఈ క్రమంలో తెలుగులోనూ ఆఫర్లు అందుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమవుతోంది. 
 

చెన్నై భామ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)  ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడ్ర్’ చిత్రంలో నటించి మెప్పించింది. తన బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

ఆ తర్వాత ప్రియాంక నటించిన చిత్రం ‘ శ్రీకారం’. శర్వానంద్ హీరో. ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బ్యూటీఫుల్ హీరోయిన్ గా మాత్రం ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది. ఆ రెండు సినిమాల తర్వాత తెలుగులో కాస్తా గ్యాప్ తీసుకుంది. 
 


ఇప్పుడు మళ్లీ వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ - సుజీత్ ప్రాజెక్ట్ OGలోహీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ అమ్మడు కెరీర్ మరో మలుపు తిరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో మరో చిత్రంలోనూ ఛాన్స్ దక్కించుకుంది.

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఎంపికైందంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ మరిన్ని ప్రాజెక్ట్స్ ను ఓకే చేసే పనిలో ఉందని తెలుస్తోంది. 

ఇక తమిళంలో ప్రియాంక మోహన్ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ధనుష్ తో భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’, జయం రవితో ‘బ్రదర్’ అనే చిత్రంలో ప్రియాంక నటిస్తోంది. ఇక విజయ్ దళపతి 68వ చిత్రంలో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ దక్కడం విశేషం. దీంతో ప్రస్తుతం నాలుగైదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. 
 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ ప్రియాంక మోహన్ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటోంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ సొగసైన చీరలో దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ శారీలో మెరిసి మెస్మరైజ్ చేసింది. క్యూట్ ఫోజులతో ఆకట్టుకుంది. 

Latest Videos

click me!