గ్రీన్ గౌన్ లో సదా మెరుపులు.. మత్తెక్కించే ఫోజులిస్తూ హార్ట్ బీట్ పెంచుతున్న ‘జయం’ బ్యూటీ

First Published | Jun 23, 2023, 10:55 AM IST

సీనియర్ హీరోయిన్ సదా (Sada)  రానురాను మరింతగా అందాలను ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది.
 

‘జయం’ సినిమాతో నటి సదా కెరీర్ ప్రారంభమైంది. నితిన్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం, నటనతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
 

హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సొంతం కావడంతో వెంటనే కోలీవుడ్ లో అడుగుపెట్టింది. తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.


అయితే, సదా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు ఐదేళ్లుగా వెండితెరపైకి రాలేదు సదా. ఇందుకు కారణంగా అంతకు ముందు వచ్చిన సినిమాల ఫలితాలే. సదా చేసిన కొన్ని ప్రయోగాలు బెడిసికొట్టడమే. 
 

సినిమా అవకాశాలు లేకపోవడంతో  ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై సందడి చేయడం ప్రారంభించింది. పాపులర్ రియాలిటీ డాన్స్ షో ‘Dhee14’కి జడ్జీగా వ్యవహరించింది. టీవీ ఆడియెన్స్ ను బాగా అలరించింది.

బుల్లితెరపై జడ్జీగా హుందా తనాన్ని చూపిస్తూనే మరోవైపు తన అందంతోనూ ఆకట్టుకుంది. వయస్సు పెరుగుతున్నా చెక్కు చెదరని గ్లామర్ తో కట్టిపడేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. 

మరోవైపు సోషల్ మీడియాలోనూ సదా ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో పాటు ట్రెండీ వేర్స్ లో ఫొటోషూట్లు మతులు పోగొడుతోంది. గ్లామర్ మెరుపులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 

తాజాగా సదా మరిన్ని ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. గ్రీన్ గౌన్ లో జయం బ్యూటీ ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతోంది. మోకాళ్ల వరకు ఉన్న డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. మత్తు ఫోజులిస్తూ.. బ్యూటీఫుల్ స్మైలత్ కట్టిపడేసింది.
 

ప్రస్తుతం సదా పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతూ ఆమెను ఆకాశానికి ఎత్తున్నారు.ఇదిలా ఉంటే సదా మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. చివరిగా ‘హాలో వరల్డ్’లో నటించింది. ఇక బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు దర్శనమిస్తుందో చూడాలి.
 

Latest Videos

click me!