మిషన్‌ ఇంపాజిబుల్‌లా ఎన్టీఆర్‌ `శక్తి` తీయాలనుకున్నా.. అంతా ఆయనే చేశాడు.. తెరవెనుక కథ చెప్పిన మెహర్‌ రమేష్‌

Published : Feb 14, 2024, 03:20 PM ISTUpdated : Feb 14, 2024, 03:29 PM IST

ఎన్టీఆర్‌తో చేసిన `శక్తి` సినిమా డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. అయితే మొదట అనుకున్న కథ అది కాదట. దర్శకుడు మెహర్‌ రమేష్‌ తెర వెనుక కథని బయటపెట్టాడు.   

PREV
17
మిషన్‌ ఇంపాజిబుల్‌లా ఎన్టీఆర్‌ `శక్తి` తీయాలనుకున్నా.. అంతా ఆయనే చేశాడు.. తెరవెనుక కథ చెప్పిన మెహర్‌ రమేష్‌

ఎన్టీఆర్‌ హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వచ్చని `శక్తి` సినిమా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌ అయ్యింది. భారీ హైప్‌తో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమాని నిర్మించిన అశ్వనీదత్‌ భారీగా నష్టపోయారు. కోట్లలో నష్టం వాటిళ్లింది. ఈ దెబ్బకి నిర్మాత కొంత కాలం సినిమాలు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. 
 

27

అయితే ఈ మూవీ ఫ్లాప్‌ కావడానికి కారణం చెప్పాడు దర్శకుడు మెహర్‌ రమేష్‌. తెరవెనుక జరిగిన కథ చెప్పాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని రివీల్‌ చేశాడు. తాజాగా ఆ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో దర్శకుడు మెహర్‌ రమేష్‌ చెబుతూ తాను మొదట అనుకున్న కథ వేరే అని తెలిపారు. 
 

37

తాను మిషన్‌ ఇంపాజిబుల్ తరహాలో ఓ కథని అనుకున్నానని తెలిపారు. మొదటి కథలో ఒక గైడ్‌ ఉంటాడు. అతను హోంమినిస్టర్‌ కూతురుని కాపాడతాడు. తీరా చూస్తే అతను గైడ్‌ కాదు, ఎన్‌ఎస్‌జీ కమాండో అని తెలుస్తుంది. ఆ సమయంలోనే హీరోహీరోయిన్ల మధ్య మంచి లవ్‌ ట్రాక్‌ ఉంటుందని తెలిపారు మెహర్‌ రమేష్‌. 

47

కానీ నిర్మాత ఐశ్వనీదత్‌ ఈ కథని మార్చేశారని తెలిపారు. ఆ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ `బృందావనం` చేస్తున్నాడు. దీంతో తమ `శక్తి` మూవీకి గ్యాప్‌ వచ్చిందట. ఆ సమయంలోనే నిర్మాత మార్పులు చెప్పారట. సెకండాఫ్‌లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్లని యాడ్‌ చేద్దామన్నాడని, ఆయన మాట కాదనలేక వాటిని యాడ్‌ చేసినట్టు తెలిపారు. అందుకోసం యండమూరి వీరేంద్రనాథ్‌ వంటి ఇద్దరు ముగ్గురు పండిత రైటర్లని అందించాడని, కానీ ఆ తర్వాత ఆ ఎలిమెంట్లు తనకే అర్థం కాలేదని తెలిపారు. 

57

ఈ విషయాన్ని నిర్మాత దత్‌కి చెప్పాడట. ముందు అనుకున్న కథని అలానే ఉంచి, వేరే కథతో సినిమా చేద్దామని అడిగాడట. లేదు ఈ ఎలిమెంట్లు బాగా వర్కౌట్‌ అవుతాయని వాళ్లు చెప్పడంతో తీయాల్సి వచ్చిందన్నారు. అయితే ఆడియెన్స్ కి సినిమా ఎక్కకపోయినా విజువల్‌గా ఆ మూవీ ది బెస్ట్ అని తెలిపారు మెహర్‌ రమేష్‌. అంతేకాదు బడ్జెట్‌ వైజ్‌గా ఈ మూవీ నిర్మాతకి బాగా వర్కౌట్‌ అయిన మూవీగా మెహర్‌ రమేష్‌ చెప్పడం గమనార్హం. 
 

67

ఎన్టీఆర్‌, ఇలియానా జంటగా, సోనూసూద్‌ విలన్‌ పాత్రలో నటించిన ఈ మూవీ 2011లో విడుదలైంది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి నిర్మాతకి ముప్పైకోట్లకుపైగా నష్టాలను తెచ్చిందనే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు మెహర్‌ రమేష్‌.. నిర్మాతకి బాగా వర్కౌట్‌ అయిన సినిమాగా చెప్పడం గమనార్హం. 
 

77

దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఇటీవల చిరంజీవితో `భోళా శంకర్‌` మూవీని రూపొందించారు. ఇది పెద్ద డిజాస్టర్‌ అయ్యింది. ఇది తమిళంలో హిట్‌ అయితే `వేదాళం`కి రీమేక్‌. మరోవైపు ఆయన `శక్తి`తోపాటు ముందు చేసిన `కంత్రి`, `బిల్లా`, ఆ తర్వాత చేసిన `షాడో` చిత్రాలు కూడా పరాజయం చెందిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories