బిస్కెట్ కొరుకుతూ రకుల్ చిలిపి పోజులు.. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న ఢిల్లీ భామ..

First Published | Jun 23, 2023, 4:23 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టీ తాగుతూ ఫొటోలకు చిలిపిగా ఫోజులిచ్చింది.
 

మొన్నటి వరకు బాలీవుడ్ లో దుమ్ములేపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం కోలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

నెట్టింట ఈ ముద్దుగుమ్మ వరుసగా పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. స్టన్నింగ్ ఫొటోషూట్లతో అదరగొడుతూ వస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో హద్దులు మీరి గ్లామర్ షో చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 


తాజాగా మరిన్ని ఫొటోలను రకుల్ ప్రీత్ పంచుకుంది. ఈసారి పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెండీ వేర్స్ లో ఢిల్లీ భామ క్యూట్ లుక్స్ ను సొంతం చేసుకుంది. చిలిపి ఫోజులతో ఫిదా చేసింది. 

చాయ్, బిస్కెట్ తింటూ రకుల్ ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. రకుల్ ఎలాంటి లుక్ లో మెరిసినా ఫ్యాన్స్ ఫిదా అవుతూనే ఉంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఫొటోలను కూడా లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే రకుల్ బాలీవుడ్ లో గతేడాది దుమ్ములేపింది. ఏకంగా ఐదు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ సినిమా ఫలితాలు బెడిసికొట్టడంతో మళ్లీ దక్షిణాది సినిమాలవైపు చూస్తోంది. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.
 

ఎస్ శంకర్ - కమల్ హాసన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తోంది. అలాగే శివ కార్తీకేయన్ సరసన ‘ఆయలాన్’లోనూ మెరియనుంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో మళ్లీ ఎప్పుడూ సినిమా చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!