చిరంజీవి, బాలకృష్ణలు ఎలాంటి వారో చెప్పిన టాలీవుడ్ సీనియర్ నటి.. వారితో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

Published : Mar 16, 2024, 09:20 AM IST

చిరంజీవి, బాలకృష్ణలపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రచన బెనర్జీ (Rachana Banerjee) హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. బడా హీరోలపై ఇలా స్పందించింది.  

PREV
16
చిరంజీవి, బాలకృష్ణలు ఎలాంటి వారో చెప్పిన టాలీవుడ్ సీనియర్ నటి.. వారితో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Balakrishna)  వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తున్నారు. 

26

వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ (Vishwambhara), బాలయ్య ‘ఎన్బీకే109’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. 
 

36

అయితే, వీరిద్దిరపై తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి రచన బెనర్జీ హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తన నటన రోజులను గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. 
 

46

తను తెలుగులో చాలా మంది హీరోల సరసన నటించానని చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి, బాలయ్యలతో వర్క్ చేయడం బాగుంటుందన్నారు. కానీ బాలకృష్ణ సెట్స్ లో కోపంగా ఉండేవారని, ఏదైనా తప్పు జరిగితే అస్సలు ఊరుకునే వారు కాదని చెప్పారు. 
 

56

ఇక చిరంజీవి లాంటి వ్యక్తితో తను వర్క్ చేయడం సంతోషంగా ఉందన్నారు. చిరుతో పాటు రజినీ, అమితాబ్ ఎద్ద పెద్ద స్టార్లైనా వారు మత్రం సింపుల్ గా ఉండటం బాగా నచ్చుతుందన్నారు. తెలుగులో మళ్లీ కంబ్యాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కానీ మంచి కథ అయితేనే నటిస్తానన్నారు. 
 

66

ఈ జనరేషన్ లో తనకు రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక రచన బెనర్జీ ‘నేనే ప్రేమిస్తున్నాను’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిరు సరసన ‘బావగారు బాగున్నారా?’, బాలయ్య సరసన ‘సుల్తాన్’ అనే చిత్రంలో నటించింది. అలాగే ‘కన్యాదానం’, ‘అభిషేకం’, ‘పెద్ద మనుషులు’, ‘అంతా మన మంచికే’ వంటి సినిమాల్లో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories