Keerthy Suresh : కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్.. తొలిసారిగా పాన్ ఇండియా స్టార్ కు జోడీగా.. ఎవరంటే?

Published : Mar 16, 2024, 08:05 AM IST

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)  చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా టాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ ను అందుకుంది. తొలిసారిగా మన స్టార్ హీరోకు జోడీగా నటించబోతుంటడం హాట్ టాపిక్ గ్గా మారింది. 

PREV
16
Keerthy Suresh : కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్.. తొలిసారిగా పాన్ ఇండియా స్టార్ కు జోడీగా.. ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘మహానటి’తో మొదలైన తన సక్సెస్ ను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. 

26

స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ మెప్పిస్తోంది. చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి మెప్పించింది. తన నటనతో ఆకట్టుకుంది. 
 

36

ఇప్పుడు టాలీవుడ్ లో మరో బిగ్ స్టార్ సరసన ఈ ముద్దుగుమ్మకు నటించే ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు.. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  కావడం విశేషం. 

46

అయితే అల్లు అర్జున్ నెక్ట్స్ ‘పుష్ప2 ది రూల్’ చిత్రంతో అలరించబోతున్నారు. ఆ తర్వాత మూడు ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, అట్లీతో సినిమాలు ఫిక్స్ అయ్యి ఉన్నాయి. 
 

56

ఈ ప్రాజెక్ట్స్ గురించి వరుసగా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అట్లీ (Atlee) - అల్లు అర్జున్ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫమ్ అయ్యారు.

66

ఇప్పుడు హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక కీర్తి ‘అక్క’ అనే వెబ్ సిరీస్ తో పాటు వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’, ‘రివాల్వర్ రీటా’, ‘రఘుతాత’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories