Guppedantha Manasu 16th march Episode:మను జన్మ రహస్యం విప్పే పనిలో వసు, మరదలితో మను సరదాలు..

Published : Mar 16, 2024, 07:53 AM IST

అనుపమ గురించిచ మీకు మొత్తం తెలుసా అని అడుగుతుంది. అన్నీ తెలుసు అని అనుకున్నానని.. కానీ.. తెలియదని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని మహేంద్ర కూడా అంటాడు.  

PREV
16
Guppedantha Manasu 16th march Episode:మను జన్మ రహస్యం విప్పే పనిలో వసు, మరదలితో మను సరదాలు..
Guppedantha Manasu

Guppedantha Manasu 16th march Episode: ఇంట్లో మను కూర్చొని ఉంటాడు.  అక్కడికి పెద్దమ్మ వస్తుంది. వచ్చి.. భోజనం చేయమని అడుగుతుంది. అయితే.. మను మాత్రం.. తనకు ఆకలిగా లేదని చెబుతాడు. ఎందుకు.. అంత సంతోషంగా ఉన్నావా అని అంటుంది. సంతోషంతో ఆకలి కడుపు నింపుకున్నావా అంటే నవ్వుతాడు. వసుధార పుట్టినరోజు బాగా జరిగిందా అని ఆమె అడుగుతుంది. చాలా గ్రాండ్ గా జరిగిందని చెబుతాడు. ఎవరెవరు వచ్చారు అంటే.. అనుపమ పేరు తప్ప అందరి పేర్లు చెబుతాడు. మరి అనుపమ అని ఆమె అడుగుతుంది. మాట్లాడావా అనుపమతో అని మళ్లీ అడుగుతుంది. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవరకు మా మధ్య మాటలు లేవు అంటాడు. పెద్దావిడ ఏదో నచ్చచెప్పాలని చూసినా మను ఊరుకోడు. చచ్చేవరకు తనకు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా లేవు అని బాధపడతాడు. తన తండ్రి వివరాలు తెలుసుకోవాలని మను అనుకుంటున్నాడు కాబోలు.. అనుపమ చెప్పకపోవడంతో వారి మధ్య ఈ దూరం ఉందని తెలుస్తోంది.
 

26
Guppedantha Manasu


సీన్ కట్ చేస్తే... వసుధార.. అనుపమ ప్రవర్తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అనుపమ చెబుతున్నదాంట్లో నిజం లేదని.. వారి మధ్య ఏదో ఉందని తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. అనుపమ గురించిచ మీకు మొత్తం తెలుసా అని అడుగుతుంది. అన్నీ తెలుసు అని అనుకున్నానని.. కానీ.. తెలియదని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని మహేంద్ర కూడా అంటాడు.

36
Guppedantha Manasu

అయితే.. అనుపమ మేడమ్ బాగా మారిపోయిందని.. , ఆమె ప్రవర్తన భిన్నంగా ఉందని, ముఖ్యంగా మనుని చూసినప్పుడు ఆమె కళ్లల్లో ప్రేమ చూశాను అని వసుధార అంటుంది.తనకు కూడా అలానే అనిపించిందని మహేంద్ర అంటాడు. అయితే.. అనుపమ మేడమ్ చివరగా మీరు ఎప్పుడు కలిశారు అని వసుధార అడుగుతుంది. అరకులో కనిపించిందని... అలా కనిపించడానికి ముందు.. జగతి కడుపుతో ఉన్నప్పుడు అన్నీ అనుపమే దగ్గర ఉండి చూసుకుందని.. రిషి పుట్టిన తర్వాత.. అనుపమ కనిపించకుండా పోయిందని చెబుతాడు. చాలా వెతికాం కానీ.. అనుపమ జాడ దొరకలేదని చెబుతాడు. తర్వాత.. మళ్లీ అరకులోనే కనిపించదని.. కానీ అప్పటికే జగతి దూరం అయ్యిందని.. ఇప్పుడేమో రిషి కూడా కనిపించడం లేదని.. మహేంద్ర బాధపడతాడు. రిషికి కర్మకాండలు చేయాలని ప్రయత్నం చేసిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకొని.. మరోసారి వసుధారకు క్షమాపణలు చెబుతాడు. తాను కూడా రిషికోసం వెతుకుతున్నానని.. రిషి త్వరలో దొరుకుతాడు అని చెబుతాడు. తర్వాత.. అనుపమ ఏదో దాచి పెడుతోందని మహేంద్ర అంటాడు. మీరు అడిగితే నిజం చెబుతారేమో అనివసుధార అంటే... అడిగాను అని.. అయినా.. నిజం చెప్పడం లేదని  మహేంద్ర అంటాడు.

 

46
Guppedantha Manasu

అసలు.. అనుపమ మేడమ్ పెళ్లి ఎందుకు చేసుకోలేదో మీరు అడిగారా అను వసు అంటుంది. అడగలేదని.. సందర్భం రాలేదని మహేంద్ర అంటాడు. అయితే.. వసుధార మాత్రం ఇప్పుడే అడగొచ్చుకదా అంటుంది. ఇప్పుడు అడగలేను అని.. వాళ్లిద్దరి మధ్య ఏదైనా ఉంటే... త్వరలోనే నిజం బయటపడుతుందని మహేంద్ర అంటాడు. ఇక.. వాళ్లిద్దరి మధ్య ఏముంటుంది అని.. వసు ఆలోచనలో పడుతుంది.

56
Guppedantha Manasu

అసలు మా అత్తయ్య ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తుంది.. ఒకసారి కలుస్తాను అని కలవదు. మాట్లాడాలి అని మాట్లాడదు , ఆమెకు స్క్రూ లూజ్ అని అంటుంది. అనుపమను అలా అనేసరికి మనుకి కోపం వస్తుంది.  అలా అంటారేంటి అని కోపంగా అంటాడు. మా అత్తయ్యని అంటుంటే మీకు ఎందుకు కోపం వస్తోంది అని ఏంజెల్ అడుగుతుంది. మీ మధ్య ఏ బంధం లేదు అని చెప్పారు కదా  అని అడుగుతుంది. పెద్దవాళ్లను అలా అనకూడదు కదా అని మను కవర్ చేస్తాడు. తర్వాత.. ఏంజెల్ నేను నీకు అబద్దం చెప్పాను అని అంటుంది ఏంటి అంటే.. నేను మీకోసం రాలేదు.. మా అత్తయ్య కోసం వచ్చాను.. నువ్వేమైనా నా అత్త కొడుకువా అని అంటుంది. మను నవ్వుకుంటాడు. అయినా మా అత్తయ్య వస్తాను అని సడెన్ గా మళ్లీ రాలేదు అని ఏంజెల్ అంటే... నేను ఉన్నాను అని చెప్పకుండా ఉండాల్సింది అని మను అంటాడు. మీరు ఉంటే మా అత్తయ్య ఎందుకు రాదు అని అడుగుతంది. ఆ విషయం మీ అత్తయ్యనే అడగండి అని చెప్పి మను వెళ్లిపోతాడు.

66
Guppedantha Manasu


ఇక.. శైలేంద్ర.. ఎండీ సీటు కోసం ఎంత ప్రయత్నించినా రావడం లేదని..తనను తాను తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే దేవయాణి వచ్చి.. కొంచెం టైమ్ పట్టినా.. నువ్వు అనుకున్నది సాధించి తీరతావు అని కొడుకును మోటివేట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories